నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలపై సీఎం కేసీఆర్ నీళ్లు చల్లారు. త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తారని.. ఒకేసారి భారీ ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తారని నిరుద్యోగులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సీఎం కేసీఆర్ చేసిన ఓ ప్రకటన నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. సీఎం కేసీఆర్ త్వరలోనే 40 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయని భావించిన నిరుద్యోగులు సీఎం కేసీఆర్ ప్రకటనతో షాక్ కు గురయ్యారు.
ఇది కూడా చదవండి : తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
నెల రోజుల క్రితం వరకు కూడా 70-80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపిన సీఎం కేసీఆర్.. తాజాగా 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడం పట్ల నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా పోలీస్, టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీలోనే కోత విధించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం 40 వేల ఉద్యోగాలను తొలివిడతలో భర్తీ చేసి, మిగతా ఖాళీలన్నింటికీ కొద్ది వ్యవధిలోనే మరో సారి నోటిఫికేషన్లు విడుదల చేస్తారన్న ప్రచారం కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది.అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తేనే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : పద్మశ్రీ గ్రహీత రామచంద్రయ్యకు భారీ నజరాన ప్రకటించిన సీఎం కేసీఆర్