మెగాస్టార్ చిరంజీవికి కోట్లలో అభిమానులు, వీరాభిమానులు ఉంటారు. ఒక హీరో పేరు మీద పెద్ద ఎత్తున రక్తదానం, నేత్రదానం, ఇతర సేవా కార్యక్రమాలు చేసిన ఘనత చిరంజీవి అభిమానులదే అని చెప్పవచ్చు. యువతను పక్కదారి పట్టకుండా.. మెగాస్టార్ చిరంజీవి సూచనల మేరకు దశాబ్దాలుగా మెగాభిమానులు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఎవరికైనా ఆపద వచ్చినా, ఏ ప్రకృతి వైపరిత్యాలు వచ్చినా అందరూ కలిసి తమ వంతు సహాయం అందజేస్తున్నారు. చిరంజీవి వీళ్ళందరికీ ఒక గురువు అయితే.. ఈ అభిమానులందరూ ఒక తాటిన నిలబడి మానవత్వం ప్రదర్శించాలంటే చిరంజీవి లాంటి వ్యక్తులు నాయకులుగా ఉంటేనే అవుతుంది. అందుకే ప్రాంతాల వారీగా, రాష్ట్రాల వారీగా చిరంజీవి యువత నాయకులు ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్లే అద్భుతాలు జరుగుతాయి. ఇలాంటి అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మెగాభిమాని మృతి చెందారు.
తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత నాయకుడు అకాల మృతి చెందారు. నాచారం గ్రామానికి చెందిన ఎం. సందీప్ రెడ్డి కన్ను మూశారు. ఈ విషయాన్ని రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ప్రెసిడెంట్ శివ చెర్రీ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘టీఎస్ చిరంజీవి యువత నాయకులు నాచారం వాస్తవ్యులు ఎం. సందీప్ రెడ్డి గారి అకాల మృతికి చింతిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. శ్రీ ఎం. సందీప్ రెడ్డి మెగా కుటుంబానికి ఎనలేని సేవలు చేశారు. వారి మృతి మనందరికీ తీరని లోటు. వారి కుటుంబానికి మెగా కుటుంబం తరపున సంతాపం తెలియజేస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. సందీప్ రెడ్డి మృతి పట్ల మెగాభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుడ్ని ప్రార్థిస్తున్నారు. మెగా కుటుంబానికి ఎనలేని సేవలు చేసి.. రాష్ట్ర చిరంజీవి యువతకు మార్గదర్శకంగా ఉండి.. ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్న మెగా అభిమాని ఎం. సందీప్ రెడ్డి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుడ్ని కోరుకుందాం.
*శ్రద్ధాంజలి*
TS చిరంజీవి యువత నాయకులు నాచారం వాస్తవ్యులు M.సందీప్ రెడ్డి గారు ఆకాల మృతికి చింతిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము
శ్రీ M.సందీప్ రెడ్డి మెగా కుటుంబానికి ఎనలేని సేవలు చేశారు
వారి మృతి మనందరికీ తీరని లోటు వారి కుటుంబానికి మెగా కుటుంబం తరపున సంతాపం తెలియజేస్తున్నాము pic.twitter.com/g7RwkWK8fn
— SivaCherry (@sivacherry9) January 16, 2023