తెలంగాణ ఏర్పాటు అనేది దేశ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం అని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా తెలిపారు. ఉమ్మడి రాష్ట్రాంలో ఎన్నో అవమానాలు చవి చూశామని.. ఆ అవమానాల నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ప్రత్యేక రాష్టం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని విధాల అన్యాయానికి గురైందని, వివక్ష, అన్యాయంతో రగిలిపోయిందని తెలిపారు. ఆ అవమానాలు తట్టుకోలేకనే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఒక్కసారిగా లక్ష ఉద్యోగాలు! KCR అసలు ప్లాన్ ఇది!
సినిమాల్లో ఒకప్పుడు తెలంగాణ భాషను కమెడియన్లకు వాడేవారని.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష వాడితేనే హీరో క్లిక్ అవుతున్నాడని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా తెలంగాణ పోరాటం సాగిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ప్రతి రూపాయి తెలంగాణ ప్రజల కోసమే ఖర్చవుతుందని చెప్పారు. నీళ్లు తెచ్చుకున్నాం.. నిధులు తెచ్చుకుంటున్నాం.. నియామకాల పంచాయతీ మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్‌తో నడుస్తూనే ఉందని కేసీఆర్ ఆరోపించారు.
తెలంగాణ పవర్..✊🔥🔥#Telangana #CMKCR @KTRTRS pic.twitter.com/aP6jgiJt9Z
— nagaraju (@editornagaraju) March 9, 2022
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు కేసీఆర్ భారీ శుభవార్త! 91 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!
ప్రసుత్తం రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని.. వీటిలో 11 వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులున్నారని తెలిపారు. వారిని రెగ్యూలర్ చేసి.. మిగతా 80 వేల ఉద్యోగాలకు ఈ రోజు నుంచే అనగా మార్చి 9 నుంచి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.