సీఎం కేసీఆర్ నిరుద్యోగలు బుధవారం ఉదయం 10 గంటలకు తప్పకుండా టీవీ చూడాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి ఉద్యోగ ప్రకటనలు లేవు. దీనిపై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. గత ఎన్నికల్లో కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించారు. కానీ ఆచరణలోకి రాలేదు. గత కొన్ని నెలలుగా త్వరలోనే భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి ప్రకటన అంటూ కేసీఆర్, ఇతర మంత్రులు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
ప్రస్తుతం తెలంగాణలో 91,142 ఉద్యోగాలు ఉన్నాయని.. వీటిని ఈ రోజే నోటిఫై చేస్తామని తెలిపారు. దీనిలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రకటించాడు. ఇప్పటి వరకు తెలంగాణలో లక్ష 65 వేల ఉద్యోగాలు నోటిఫై చేశామని తెలిపారు. ఇప్పటి వరకు లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 95 శాతం స్థానికలుకే అవకాశం కల్పించబోతున్నట్లు తెలిపారు.
తెలంగాణలో గుర్తించిన ఖాళీలు 91, 142
గ్రూప్-1 పోస్టులు- 503,
గ్రూప్-2 పోస్టులు- 582
గ్రూప్-3 పోస్టులు- 1,373
గ్రూప్-4 పోస్టులు- 9,168
జిల్లా స్థాయిలో- 39, 829 పోస్టులు.
జోనల్ లెవల్‌లో- 18, 866 పోస్టులు
మల్టీజోనల్‌లో- 13, 170 ఉద్యోగాల ఖాళీ
ఇతర కేటగిరీ, వర్సిటీల్లో- 8, 174 పోస్టులు..
నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో పాటు మొత్తం ఖాళీలలో.. 80,039 పోస్టులకు ఇవాళ్టి(మార్చి 9, 2022) నుంచే నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. 11, 103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు సీఎం కేసీఆర్. కేసీఆర్ ప్రకటనపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.