పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. కొద్దిసేపటి క్రితమే హనుమకొండ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసుపై కాసేపట్లో విచారణ జరగనుంది. కోర్టు సంజయ్ కు బెయిల్ ఇస్తుందా ? రిమాండ్ విధిస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. ఇదిలావుంటే బండి సంజయ్ ఒంటిపై గాయాలున్నట్లు సమాచారం అందుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి అందరికీ విధితమే. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, వాట్సాప్ లలో ప్రచారం అంశంలో ఆయన హస్తం ఉందని తెలిపిన పోలీసులు.. వాటి ఆధారంగా ఆయనపై 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. కొద్దిసేపటి క్రితమే హనుమకొండ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసుపై కాసేపట్లో విచారణ జరగనుంది. కోర్టు సంజయ్ కు బెయిల్ ఇస్తుందా ? రిమాండ్ విధిస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. ఇదిలావుంటే బండి సంజయ్ ఒంటిపై గాయాలున్నట్లు సమాచారం అందుతోంది.
ఏప్రిల్ 05 మంగళవారం అర్థరాత్రి సమయంలో బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. మొదట బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడినుండి వరంగల్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని.. పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను వరంగల్ పీటీసీకి తరలించి.. ఆపై మెజిస్ట్రేట్ నివాసానికి తరలించారు. కోర్టు వెనుక గేటు నుంచి ఆయనను లోపలికి తీసుకెళ్లి మెజిస్ట్రేట్ అనిత రాపోలు ఎదుట ప్రవేశపెట్టారు. ఇలా బండి సంజయ్ అరెస్ట్ మొదలుకొని.. ఆయనను తీసుకెళ్లిన విధానం.. కొంతమేర రహస్యంగా సాగిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఆయనకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు బండి సంజయ్ తనకు తగిలిన గాయాలను షర్ట్ తీసి మరీ న్యాయవాదులకు చూపించారు. పోలీసులు ప్రవర్తించిన తీరు, అరెస్ట్ చేసిన విధానాన్ని ఆయన బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు వివరించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు వైరలవుతున్నాయి.
ఇదిలావుంటే.. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడంతో పాటు ప్రజల్లో అభద్రతాభావాన్ని పెంచేందుకు బండి సంజయ్ ప్రయత్నించినట్లు విచారణలో తేలిందని సీపీ రంగనాథ్ వెల్లడించారు. విచారణలో బండి సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నారని ఆయన వెల్లడించారు. ప్రశాంత్, మహేష్ ప్రశ్నాపత్రాన్ని బండి సంజయ్ కు పంపారని, ఉదయం 11.24 గంటలకు ఆయనకు క్వశ్చన్ పేపర్ చేరిందని సీపీ వెల్లడించారు. ఏ2 ప్రశాంత్ ఎమ్మెల్యే ఈటలతో పాటు ఆయన ఏపీఏకు ఉదయం 10.41 గంటలకు పేపర్ పంపాడని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. కాగా, ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్‌లో బండి సంజయ్‌ను ఏ1గా చేర్చిన పోలీసులు.. ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోగు సురేశ్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోతబోయిన వసంత్ పేర్లను చేర్చారు.