TRS MLC Mahender Reddy: టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తాండూరు పట్టణ సీఐపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆడియోపై మహేందర్ రెడ్డి స్పందించారు. అసలు ఆ ఆడియో తనది కాదని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సీఐ రాజేందర్‌ని బెదిరించానన్న ఆడియో నాది కాదు. సీఐ అంటే నాకు అపారమైన గౌరవం ఉంది. ఆ ఎమ్మెల్యే వెంట ఎప్పుడూ ఇద్దరు రౌడీ షీటర్లు ఉంటారు. ఆ రౌడీ షీటర్ల విషయాన్ని నేను సీఐ ముందు ప్రస్తావించాను. గతంలో రాజేందర్ ఎస్‌ఐగా ఉన్నప్పుడు కూడా నా ఆడియో రికార్డు చేశాడు. ఆయనకు ఆడియోలు రికార్డు చేయటం అలవాటు. నాపై కేసు పెడితే చట్ట పరంగా.. కోర్టులో తేల్చుకుంటా’’ అని అన్నారు.
కాగా, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వాయిస్‌తో ఉన్న ఓ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ ఆడియోలో మహేందర్ రెడ్డి తాండూరు సీఐ రాజేందర్‌ని పరుష పదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో తన విధులకు మహేందర్ రెడ్డి ఆటంకం కలిగించారని సీఐ రాజేందర్ తాండూరు పోలీసులకు పిర్యాదు చేశారు. తనను దూషించి, బెదిరించారని పేర్కొన్నారు. మహేందర్‌రెడ్డిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మరి, ఆ ఆడియో తనది కాదంటున్న మహేందర్‌రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : జాతిపిత గాంధీజీని ద్వేషించే దేశమా.. భారతదేశం?: సీఎం KCR
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.