Dalit Bandhu : నిరుపేద దళితులకు స్వయం ఉపాధి కల్పించటంతో పాటు వారు ఆర్థికంగా నిలదొక్కుకునే స్థోమత కల్పించే లక్ష్యంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దళిత బంధు కాస్తా టీఆర్‌ఎస్ బంధుగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ప్రజా ప్రతినిధులు తమ వారు పథకం కింద రూ.10 లక్షల రూపాయల లబ్ధి పొందేలా చేసుకుంటున్నారని సమాచారం. ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి, వారిని పథకానికి ఎంపిక చేసే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించింది. దీన్ని ఎమ్మేల్యేలు మంచి అవకాశంగా భావిస్తున్నారట. తమ వారి పేర్లను లిస్టులో చేర్చి పంపుతున్నారట.
లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం ఎమ్మెల్యేలకు అప్పగించటంతో వారు పంపిన లిస్టునే ఫైనల్ చేయాల్సి వస్తోందని అధికారులు అంటున్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పుర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తన సొంత తమ్ముడు తాటికొండ సురేశ్ కుమార్‌ను పథకానికి ఎంపిక చేశారట. ఆయనతో పాటు మరో ఇద్దరు జడ్పీటీసీల పేర్లు కూడా లిస్టులో చేర్చారంట. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజయ్య తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : RRR సినిమాపై MLA సీతక్క సంచలన వ్యాఖ్యలు!