బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలిదఫాలో భాగంగా వివిధ కేటగిరీల్లో మొత్తంగా 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. తొలిదఫాలో భాగంగా వివిధ కేటగిరీల్లో మొత్తంగా 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) కన్వీనర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇకపోతే, గురుకులాల్లో తొలుత 9,096 పోస్టులను ఖాళీగా గుర్తించింది ప్రభుత్వం. అనంతరం మరో 33 బీసీ గురుకులాలు, 15 డిగ్రీ కాలేజీలను సర్కారు మంజూరు చేసింది. దీంతో అందుకు సంబంధించిన పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించింది.
గురుకులాల్లో మరో 3 వేల పోస్టులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తంగా బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించి 13,530 పోస్టులను ఖాళీగా గుర్తించింది. వీటిలో గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులు మినహా మిగతా 10,675 పోస్టుల భర్తీని ట్రిబ్ ద్వారా ఇప్పుడు చేపట్టనున్నారు. తొలిదఫాగా 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. మిగతా పోస్టులకు సంబంధించి అందులో కొన్ని కొత్తగా మెస్ ఇన్ఛార్జ్, మరికొన్ని పోస్టులకు సర్వీస్ రూల్స్‌ను రూపొందించాల్సి ఉందని సమాచారం. తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో అత్యధికంగా ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) విభాగంలో 4,090, ఆ తర్వాత జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, పీడీ కేటగిరీకి 2,008, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) విభాగంలో 1,276 పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ మేరకు గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. pic.twitter.com/HzWvPFSaW6
— BRS Party (@BRSparty) April 6, 2023