నేటికాలంలో ప్రైవేట్ వైద్యానికి వెళ్ళాలంటే వేలు, లక్షల రూపాయలు కావాల్సిందే. ఓపీ ఫీజుకే వందల్లో వసూలు చేస్తున్నాయి ఆస్పత్రులు. ఇలాంటి సమయంలో పేదలను ఆదుకునేందుకు ఓ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ఆ ఛారిటబుల్ ట్రస్ట్ పేదలకు ఒక్క రూపాయితో వైద్యం అందిస్తోంది.
నేటికాలంలో ప్రైవేట్ వైద్యానికి వెళ్ళాలంటే వేలు, లక్షల రూపాయలు కావాల్సిందే. ఓపీ ఫీజుకే వందల్లో వసూలు చేస్తున్నాయి ఆస్పత్రులు. ఇక ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన పర్యవేక్షణ ఉండక.. పట్టించుకునే వారు లేక.. ఎన్ని ఇబ్బందులు పడాలో అందరికి తెలుసు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే ఒక్క మాట చాలు అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పడానికి. అందుకే అప్పు చేసైనా సరే.. చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లడానికే మొగ్గు చూపుతారు. ఇలాంటి సమయంలో పేదలను ఆదుకునేందుకు ఓ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ఆ ఛారిటబుల్ ట్రస్ట్ పేదలకు ఒక్క రూపాయితో వైద్యం అందిస్తోంది. వైద్య పరీక్షలను కూడా నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తోంది రాంనగర్ లోని జీజీ హాస్పిటల్. ఇంకా ఆశ్చర్యం ఏమింటే కేవలం ఒక్క రూపాయికే హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు.
సాధారణ జ్వరం లాంటి చిన్న రోగాలకైనా డాక్టర్ల దగ్గరకు వెళ్ళాలంటే ఓపీ ఫీజు చెల్లించాల్సిందే. మినిమం రూ.200 నుంచి 500 రూపాయల దాకా ఫీజు కట్టాలి. అయితే రాంనగర్ లోని జీజీ చారిటబుల్ హాస్పిటల్ లో ఒక్క రూపాయి ఫీజుతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క రూపాయితో కనీసం టీ కూడా తాగలేం. ఇప్పటి వరకు ఎన్నో వైద్య సేవలను రూపాయికే అందించిన ఈ ట్రస్ట్.. హార్ట్ ఆపరేషన్ కి కూడా కేవలం ఒక్క రూపాయికే చేస్తున్నారు. పేదలందరికీ వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో రూపాయికే 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నట్టు సంస్థ చైర్మన్ గంగాధర్ గుప్తా తెలిపారు.
పైడి రాకేశ్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి ట్రస్ట్ లు పలు చోట్ల నడుస్తున్నాయి. ఈ ఫౌండేషన్ ద్వారా ఇటీవలే గుండె ఆపరేషన్ చేయించుకున్న బాధితుల కుటుంబ సభ్యులు గంగాధర్ గుప్తాకు, రాకేశ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలా ఎందరో పేద ప్రజలకు రాకేశ్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా వైద్యం, విద్య ఉచితంగా అందిస్తున్నారు. ఈక్రమంలో పైడి రాకేశ్ రెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ రాకేశ్ రెడ్డిని సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేసింది. ఆయన తన ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఆయన అనేక విషయాలు షేర్ చేసుకున్నారు.
రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. “ఏం సంపాదించిన సమాజానికి ఎలా ఉపయోగపడాలి.. ఏ రకంగా బలహీనులకు సాయపడాలి, అలానే పేదవారికి ఏ రకంగా సాయం అందించాలి అనే ఉద్దేశ్యంతోనే మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అలానే గుప్తా లాంటి వారికే కాకుండా ఇంకా చాలా ట్రస్ట్ లకు కూడా మేము సాయ పడుతున్నాము. ఎక్కడ అవసమైతే.. అదే ప్రాంతంలో చికిత్స చేయిస్తున్నాము. నేను చేసే ఈ మంచి కార్యాన్ని చూసి నా స్నేహితులు కూడా స్ఫూర్తి పొందుతున్నారు. డబ్బు ఉన్నవాళ్లు, సంపాదించిన వాళ్లు.. కొద్ది మొత్తంలోనైనా సమాజానికి సాయపడాలని నేను కోరుకుంటున్నాను.
అందుకే రూ.10 కోట్ల విలువ చేసే నా బిల్డింగ్ ను ట్రస్ట్ కు ఉచితంగా ఇచ్చేశాను. అలానే తిరుపతి, విశాఖపట్నం, వరంగల్ లో కూడా నిర్మించాలని అనుకుంటున్నాము. ఏదో ఒకరకంగా పేదవాళ్లకి సాయపడాలనేది నా ముఖ్య ఉద్దేశం. దేవుడి ఆశీర్వదం ఉంటే భవిష్యత్ లో మరెన్నో కార్యక్రమాలు చేస్తాము” అని పైడి రాకేశ్ రెడ్డి పౌండేషన్ ఛైర్మన్ తెలిపారు. మరి..లక్షలు ఖర్చై గుండె ఆపరేషన్ ను కేవలం ఒక్క రూపాయికి చికిత్స చేయిస్తున్నారు. మరి.. రాకేశ్ రెడ్డి ఒక్క రూపాయికే వైద్యం అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.