వీళ్లిద్దరూ భార్యాభర్తలు. ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్ల సంతానం. అందరికీ పెళ్లిళ్లు చేశారు. సంతోషంగా బతుకుతున్న తరుణంలోనే భర్త పక్షవాతానికి గురయ్యాడు. కొన్నాళ్ల తర్వాత భార్య కూడా అనారోగ్య పాలైంది. మంచాన పడి అందరికీ భారమయ్యామని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నర్సయ్య, లక్ష్మమ్మ దంపతులు. వీరికి చాలా ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరు కూమార్తెలు, ఓ కుమారుడు సంతానం. వీరిని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు. ఇక పెళ్లి వయసు రాగానే తల్లిదండ్రులు ముగ్గురికీ పెళ్లిళ్లు చేశారు. ఇక కొడుకుకి తోడు రావడంతో చాలా కాలం నుంచి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే నర్సయ్య పక్షవాతంతో మంచానికి పరిమితమయ్యాడు. అప్పటి నుంచి భార్యే భర్త బాగోగులు చూసుకుంది. ఈ క్రమంలోనే భార్య లక్ష్మమ్మ కూడా మూత్రపిండాల జబ్బుకు గురైంది. ఇక అందరికీ భారమైన ఈ బతుకు వద్దనుకుని ఈ వృద్ధ దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
స్థానికుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామం. ఇక్కడే నర్సయ్య-లక్ష్మమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కూతురు సంతానం. చిన్నప్పటి నుంచి పిల్లలను ఎంతో కష్టపడి పెంచారు. ముగ్గురికి పెళ్లిళ్ల వయసు రావడంతో ఈ దంపతులు ఘనంగా పెళ్లిళ్లు చేశారు. ఇక ఉన్న 10 ఎకరాల భూమిని కౌలుకు ఇచ్చారు. ఇక కొడుకు భార్యతో పాటు గత కొన్నేళ్ల వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులు మాత్రం ఇంటి వద్దే ఉండేవారు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల కిందట నర్సయ్య పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు.
దీంతో కూతుళ్లు, కొడుకు అప్పుడప్పడు వచ్చి చూసి వెళ్లిపోయేవారు. అతని బాగోగుల మాత్రం భార్య లక్ష్మమ్మ చూసుకునేది. అయితే ఈ క్రమంలోనే లక్ష్మమ్మ మూత్రపిండాల జబ్బుకు గురైంది. దీంతో ఇద్దరూ అనారోగ్యానికి గురవ్వడంతో ఏ పని చేసుకోవాలన్న వారికి కష్టంగా మారింది. దీంతో ఈ వృద్ధ దంపతులు తరుచు బంధువులకు చెప్పి బాధపడేవారు. జీవితంపై విరక్తితో ఎన్నోసార్లు చనిపోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఈ వృద్ధ దంపతులు మంచానపడి అందరికీ భారమయ్యామని చనిపోవాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్నట్లుగానే ఈ దంపతులు శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగారు. తెల్లవారినా కూడా దంపతులు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే తలుపులు తెరిచి చూడగా ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్నారు. ఇదే విషయాన్ని కొడుకు, కూతుళ్లకు తెలియజేశారు. వెంటనే ఇంటికి చేరుకుని తల్లిదండ్రులను చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ హృదయవిదారక ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంచానపడి అందరికీ భారమయ్యామని బలవన్మరణానికి పాల్పడిన ఈ వృద్ధ దంపతుల నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.