భర్త కళ్లముందే భార్య చనిపోతే ఎలా ఉంటుంది. ఆ బాధ వర్ణనాతీతం. కానీ, తాజాగా మెదక్ జిల్లాలో అదే జరిగింది. అతని కళ్లముందే భార్య మరణించంతో గుండెలు పగిలేలా ఏడ్చాడు. అసలేం జరిగిందంటే?
మరణం.. ఎప్పుడు, ఎలా, ఎవరికి వస్తుందో చెప్పలేము. కొందరు నిద్రలోనే కన్నుమూస్తే, మరికొందరు ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. ఇదిలా ఉంటే.. ఓ మహిళ తన భర్త కళ్లముందే కన్నుమూసింది. ఈ సీన్ చూసిన ఆమె భర్త గుండెలు పగిలేలా ఏడ్చాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అయితే ఆ మహిళ మరణించడంతో ఇద్దరు కూతుళ్లు తల్లిలేని వారయ్యారు. ఈ ఘటనతో వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అసలేం జరిగిందంటే?
మెదక్ జిల్లా చౌట్కూరు మండలం మూసాపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్షిత (29) అనే మహిళకు గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఆ దంపతులకు ఇద్దరు కూతుళ్లు జన్మించారు. ఇక పుట్టిన కూతుళ్లను చదివించుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. అయితే అక్షితా తన భర్తతో పాటు కలిసి మంగళవారం స్కూటీపై కల్పగూర్ లో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లారు. అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా ఈ దంపతులు సుల్తాన్ పూర్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడికి రాగానే వీరి స్కూటీని వెనకాల నుంచి ఓ లారీ ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో అక్షితా కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. భర్త మాత్రం తీవ్ర గాయాల పాలై ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదిలా ఉంటే.. అతని కళ్లముందే భార్య మరణించడంతో భర్త గుండెలు పగిలేలా ఏడ్చాడు. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన మృతురాలి భర్తను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న అక్షిత కూతుళ్లు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అక్షిత మరణంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.