ఏ దంపతులకైన పిల్లలు పుడితే ఆ రోజు ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ, ఓ తండ్రి మాత్రం.. కొడుకు పుట్టిన రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొడుకు పుట్టిన రోజే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. కొడుకు పుట్టిన రోజే తండ్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఈ ఘటన వెనుక అసలేం జరిగిందంటే? అది జిల్లాలోని ఉండవెల్లి ప్రాంతం. ఇక్కడే రాజు (29)-గీత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది.
పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు సంతోషంగా ఉన్నారు. ఇక కొన్నేళ్ల తర్వాత ఈ భార్యాభర్తలకు ఓ కూతురు, కుమారుడు జన్మించాడు. ఇదిలా ఉంటే ఆదివారం ఈ దంపతులకు మరో కుమారుడు కూడా జన్మించాడు. భార్య ఆస్పత్రిలో ఉండడంతో రాజు తన కుమారుడిని చూసి ఇంటికి వచ్చాడు. ఇక వస్తూ వస్తూనే అదే రోజు మధ్యాహ్నం రాజు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు భార్య గుండెలు పగిలేలా ఏడ్చింది. కొడుకు పుట్టిన రోజు నాడే భర్త ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. ఇక రాజు తల్లిదండ్రులు సైతం శోక సంద్రంలో మునిగిపోయారు.
అయితే ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు అంతా రాజు ఇంటికి వచ్చి చూడగా.. అతడు ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఈ సీన్ చూసిన గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొడుకు పుట్టిన రోజు నాడే తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అయితే కొడుకు పుట్టిన రోజే తండ్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఏం జరిగిందనే అసలు నిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.