నగర ప్రజలకు ముఖ్య అలెర్ట్ అందుతోంది. ప్రధాని రాష్ట్ర పర్యటన దృష్ట్యా నగరంలో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆ వివరాలు..
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు అంతా సిద్ధమైంది. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. మోదీ పర్యటనకు రాష్ట్ర పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలు.. దాదాపు వెయ్యి మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ట్రయిల్ రన్ పూర్తవ్వగా, బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎవరైనా ప్రధాని పర్యటనకు అడ్డుపడితే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
శనివారం ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌లలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ వేదికగా సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. ఆ తరువాత రూ.720కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, బొల్లారం-మేడ్చల్, ఫలక్‌నుమా-ఉందానగర్ సెక్షన్లలో ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించనున్నారు. అదే వేదికపై ప్రధాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఉదయం 9:00 నుంచి మద్యాహ్నం 2:30 వరకు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లీంచనున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చే పలు ప్రాంతాలలో ఈ ఆంక్షలు ఉన్నాయి. చిలకలగూడ జంక్షన్ నుంచి ప్రయాణికులు.. క్లాక్‌టవర్, పాస్‌పోర్టు ఆఫీస్, రెజిమెంటల్ బజార్ మెయిన్ రోడ్డు ద్వారా సికింద్రాబాద్ స్టేషన్ మెయిన్ ఎంట్రెన్స్‌లోకి వెళ్లాలని పోలీసులు సూచించారు. అలాగే, పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభకు వచ్చే వాహనాలు ఆయా రూట్లలోని నిర్దేశిత ప్రాంతాల్లోనే పార్కింగ్ చేసుకోవాలని పేర్కొన్నారు.
ఇక కరీంనగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు దోబీఘాట్, జేబీఎస్ సమీపంలోని కంటోన్మెంట్ పార్క్ వద్ద, నాగర్‌కర్నూల్, నల్లగొండ నుంచి వచ్చే వాహనాలు ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌లో, వరంగల్ నుంచి వచ్చే వాహనాలు ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌లో, అదిలాబాద్, సంగారెడ్డి వైపు నుంచి వచ్చే వాహనాలు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో, మహబూబ్‌నగర్, వికారాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్డు వద్ద, హైటెక్‌సిటీ, మాదాపూర్, ఎస్‌ఆర్ నగర్, పంజాగుట్ట, ట్యాంక్‌బండ్ వైపు నుంచి పరేడ్‌గ్రౌండ్‌కు వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్డుకు చేరుకొని అక్కడ పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. రోజువారీ ఆఫీసులకు వెళ్లేవారు ఈ ట్రాఫిక్ ఆంక్షలకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవటం ఉత్తమం. ఈ ఆంక్షలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రుపంలో తెలియజేయండి.
#HYDTPinfo
Commuters are requested to note the traffic restrictions/diversions in view of visit of 𝐇𝐨𝐧’𝐛𝐥𝐞 𝐏𝐫𝐢𝐦𝐞 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐞𝐫 𝐨𝐟 𝐈𝐧𝐝𝐢𝐚 to Hyderabad tomorrow i.e., on 𝟎𝟖-𝟎𝟒-𝟐𝟎𝟐𝟑. #TrafficAlert #TrafficAdvisory
Notification: https://t.co/HRLwaSiF9S pic.twitter.com/1zSZZ66uLG— Hyderabad Traffic Police (@HYDTP) April 7, 2023