ఇటీవల తెలంగాణలో రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించిన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలకు విద్ధంగా బ్లాక్‌ఫిల్మ్ ఉన్న కార్లకు జరిమానా విధిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోలు అయిన అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లకున్న బ్లాక్ ఫిల్మ్ ని తొలగించి చలానాలు విధించారు. చట్టం ముందు అందరూ సమానమే.. ఎవరినీ విడిచి పెట్టేది లేదని మరోసారి నిరూపించారు ట్రాఫిక్ పోలీసులు.
జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లోని నీరూస్ చౌరస్తాలో వాహనాలను తనికీ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ క్రమంలో అటుగా వచ్చిన అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్ల బ్లాక్ ఫిలిమ్ ఉన్న విషయం గమనించారు. కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించి రూ.700 చొప్పున చలాన్లు విధించారు. అలాగే, నిబంధనలు పాటించని మరో 80కి పైగా వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఇటీవల ఎన్టీఆర్ కారుకున్న బ్లాక్‌ఫిల్మ్‌ను తొలగించిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ నియమాలు పాటించకుంటే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు.