రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య పంచాది రోజు రోజుకు ముదురుతున్నది. పాతోళ్లు వర్సెస్ కొత్తోళ్లు అన్నట్లుగా లీడర్లు చీలిపోతున్నారు. ఒకరిపై ఒకరు హెచ్చరికలు, సవాళ్లకు దిగుతున్నారు. ముఖ్యంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్య కోల్డ్ కొంతకాలగా కోల్డ్ వార్ నడుస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొద్దిరోజులుగా రేవంత్‌రెడ్డి తీరును తప్పుపడుతున్నారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని మండిపడుతున్నారు. బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌పైనా తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చిన అదనపు బాధ్యతను తొలగించింది.
పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతలను నుంచి తప్పించింది టీపీపీసీ. ఆయనకు గతంలో అప్పగించిన బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. ఆదివారం మర్రి శశిధర్ రెడ్డి అధ్యక్షతన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీహెచ్, జగ్గారెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తాను రాజీనామా చేస్తానని.. తనపై కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్థిని పెట్టి గెలిపించాలని సవాల్ చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పీసీసీ.. జగ్గారెడ్డికి అప్పగించిన బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తుంది.