పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద… ఆయనను అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఉదయం నుంచి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కాపు కాసిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈరోజు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో నిరసన కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిరసన కార్య క్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలోనే పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి అరెస్టు సందర్భంగా పోలీసులను కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలకు పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలను అడ్డు తప్పించి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి.. రేవంత్ రెడ్డి అరెస్టును తప్పుబట్టారు. రేవంత్ అరెస్ట్ అక్రమం.. అప్రజాస్వామికం అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించారు.