గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మద్య పెద్ద యుద్దమే కొనసాగుతుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాగా, రాష్ట్రంలో ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు సైతం పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు విద్యుత్ సౌధ, సివిల్ సప్లైస్ భవనాల ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో పోలీస్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించి ఆయనను బయటకు రాకుండా అడ్డుకున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అన్యాయం అని ప్రశ్నిస్తే హౌజ్ అరెస్టులు చేస్తారు.. ఇదెక్కడి ప్రభుత్వం ప్రజల గురించి ప్రతి పక్షాలు పోరాటం చేయొదని అంటే మరిన్ని పోరాటాలు చేస్తామని అన్నారు రేవంత్ రెడ్డి. ఇలాంటి దారుణాలు కొనసాగించే ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెబుతారని కాంగ్రెస్ నేతలు అన్నారు.