పాల్వంచ కుటుంబ ఆత్మహత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యే వనమా కుమారుడు వనమా రాఘవ అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కుటుంబంతో ఆత్మహత్యకు పాల్పడ్డ రామక్రిష్ట సూసైడ్ లెటర్ లో తన చావుకు కారణం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవ అంటూ ఆరోపణలు చేశాడు. తాజాగా ఆత్మహత్యకు ముందు రామక్రిష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఏ భర్త వినకూడని మాటలను రాఘవ అడిగాడని… నీ భార్యను హైదరాబాద్ తీసుకువస్తే నీ సమస్య పరిష్కారం అవుతుందని అన్నాడని ఆరోపించాడు. నేను ఒక్కడినే చనిపోతే.. నాభార్య పిల్లలను వదిలిపెట్టరు అని వీడియోలో తెలిపాడు. దీనిపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు.
ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ తన భార్యను పంపమని ఆదేశించాడని మృతుడు రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు.. ఈ దారుణాన్ని తట్టుకోలేక రామకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడన్న రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవమృగానికి టీఆర్ఎస్ వత్తాసుగా నిలవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది చదవండి : బండి నడపడానికి లైసెన్స్ అవసరం లేదు! పోలీసులతో విద్యార్థి వాదన
ఎమ్మెల్యే కుమారుడు ఇన్నీ అరాచకాలు చేస్తుంటే సీఎంకు తెలియదా?..తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఒక కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నా.. ఇప్పటి వరకు అధికార పార్టీ స్పందించకపోవడం దారుణమైన విషయమని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఈ ఘటనపై కేసీఆర్ వెంటనే స్పందించాలని.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.