Wine Shops: శుక్రవారం హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. రేపు దాదాపు 20 వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం షాపులు క్లోజ్ అవ్వనున్నాయి. శనివారం ఉదయం ఆరు గంటల తర్వాత యథావిధిగా మద్యం షాపులు నడవనున్నాయి. నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 6 గంటలనుంచి శనివారం ఉదయం 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
దాదాపు 3 వేల మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. కాగా, రేపు నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్‌ల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవును ప్రకటించింది. మరి, శుక్రవారం హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో మద్యం షాపుల బంద్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Medchal: బ్రేకింగ్: స్కూలు ఆటోను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు చిన్నారుల మృతి!