నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపటం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రగాయాలతో నరకం అనుభవిస్తున్నారు. తాజాగా నిజమాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపటం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రగాయాలతో నరకం అనుభవిస్తున్నారు. ఇటీవలే మధ్యప్రదేశ్ లో ట్రాక్టర్ బోల్తా పడి 15 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిజామాబాద్ లోని కలెక్టర్ రేట్ సమీపంలో ఐటీహబ్ భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు బోధన్ మండలం ఊటుపల్లి తండాకు చెందిన కొందరు కూలీలుగా వెళ్తున్నారు. ఐటీహబ్ భవన నిర్మాణం జరుగుతున్న నాటి నుంచి రోజూ పనులకు వెళ్తున్నారు. గురువారం కూడా నిర్మాణ పనులకు వెళ్లారు. సాయంత్ర పనులు ముగిసిన తరువాత ఎనిమిది మంది తిరిగి ఆటోలో ఇంటికి వెళ్తున్నారు. మరికొద్ది సేపటిలో ఇళ్లకు చేరుతామనగా అంతలోనే ఘోరం చోటు చేసుకుంది. అర్సపల్లి గ్రామం సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ లో నుంచి రోడ్డుపైకి వస్తున్న మినీ డీసీఎం వాహనం వీరి ఆటోను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు ఆటో డ్రైవర్ ప్రశాంత్(35), డి.యశ్వంత్(25), డి.శ్యామ్ (48) గుర్తించారు. మరికొందరు గాయపడగా నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రేఖ(32) అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో శ్యామ్, యశ్వంత్ తండ్రీకొడుకులు. యశ్వంత్ కు గత ఏడాది పెళ్లి కాగా.. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. డ్రైవర్ ప్రశాంత్ ఆటో నడుపుతూ వారితో పాటు కూలీ పనులు చేస్తుండేవాడు. ఈ ప్రమాదంలో అతడు మృతి చెందాడు. రేఖ, రుడావత్ కృష్ణ లు భార్య భర్తలు. రుడావత్ రేఖ మృతి చెందగా.. భర్త కృష్ణ తలకు బలమైన గాయం కాగా వెంటనే హైదరాబాద్ కు తరలించారు.
ఈ దంపతులకు 9,11 ఏళ్ల కుమారులున్నారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రికి పెద్ద సంఖ్యలు సంఖ్యలో చేరుకొని కన్నీరుమున్నీరు విలపించారు. ఇక ఈ ప్రమాదం ఘటనకు కారణమైన డీసీఎం డ్రైవర్ వాహనాన్ని ఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ఆ వాహనంలో ఇనుప సామాగ్రిని తీసుకొని వస్తున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉదయాన్నే ఎంతో హుషారుగా సాఫీగా వెళ్లిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని అక్కడ ఉన్న స్థానికులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మరి.. ఈ ఘోర విషాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.