బ్యాంకుల్లో, ఏటీఎంలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎం సెంటర్లలోకి చొరబడి లక్షల్లో డబ్బులను దొంగిలిస్తుంటారు. తాజాగా సోమవారం కూడా ఓ ఏటీఎంలో దొంగలు చోరీ చేశారు. కానీ అందులోని డబ్బులను కాదు.
పూర్వం నుంచి దొంగలు అనే వారు సమాజంలో ఉన్నారు. అయితే పెద్దల కాలంలో వీరి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అయితే కాలం మారింది.. మనుషుల్లోనూ మార్పులు వచ్చాయి. అందుకే నేటి సమాజంలో చాలా మంది సులభంగా డబ్బులు సంపాదించాలనే కోరిక పెరిగిపోయింది. దీంతో మోసం, దొంగతనం వంటి అక్రమ మార్గాల్లో డబ్బులను కూడబెడుతున్నారు. దొంగలు అయితే కేవలం డబ్బులు, నగలే కాకుండా ఇతర వస్తువులను కూడా చోరీ చేస్తున్నారు. తాజాగా ఏటీఎంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ పాల్పడ్డారు. అక్కడ ఏటీఎం సెంటర్ లో చొరబడిన దుండగులు బ్యాటరీలను దొంగతనం చేశారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ టౌన్ సమీపంలో శాస్త్రీ నగర్ లోని ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎం ఉంది. సోమవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఇద్దరు దొంగలు హెల్మెంట్ ధరించి ఆ ఏటీఎం సెంటర్ వద్దకు వచ్చారు. కొద్ది సమయం పరిసరాలను గమనించిన ఆ దుండగులు అనంతరం ఏటీఎంలోకి చొరబడ్డారు. ఆ ఏటీఎంలో ఉన్న బీరువాలాంటి అమరికలో ఉండే ఆరు బ్యాటరీలను దొంగిలించారు. వాటి విలువ సుమారు రూ.30 వేలు ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఏటీఎంలో చోరీ జరిగినట్లు బ్యాంక్ మేనేజర్ నారాయణ స్వామి గుర్తించారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఏటీఏంలో చోరీ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎంలోని సీసీ కెమెరాలతో పాటు, పరిసరాల్లోని సీసీటీవీలను పోలీసులు పరిశీలీస్తున్నారు. ఏటీఏంలోని డబ్బులను వదిలేసి బ్యాటరీలు చోరీ చేయడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.