ఎండకాలం రావడంతో అందరూ కూలర్లు, ఏసీలు వంటివి వాడుతున్నారు. అయితే చల్లదనాన్ని ఇచ్చే ఈ పరికరాలే మృత్యుశకటాలు గా మారుతున్నారు. తాజాగా కూలర్ కారణంగా ఓ జవాన్ మృతి చెందారు.
ఎండకాలం రావడంతో అందరు కూలర్లు, ఏసీలు వంటివి వాడుతున్నారు. అయితే చల్లదనాన్ని ఇచ్చే ఈ పరికరాలే మృత్యుశకటాలు గా మారుతున్నారు. కరెంట్ షాక్ కారణంగా ఎందరో మృతి చెందారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో విద్యుత్ షాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ జవాన్ కూడా ఈ కరెంట్ బలి తీసుకుంది. కూలర్ లో నీళ్లు నింపుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఆ జవాన్ ప్రాణాలు వదిలాడు. ఈ విషాదం ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ములుగు జిల్లా వాజేడు మండలం శ్రీరామ్ నగర్ కు చెందిన మనోజ్ అనే వ్యక్తి ఐటీబీపీ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం మనోజ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే సెలవులు తీసుకుని ఇంటికి వచ్చాడు. రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా ఉండడంతో కూలర్ ను వాడుతున్నారు. అలానే మనోజ్ ఇంట్లో ఉన్న కూలర్ ను బయటకు తీసి వాడుతున్నాడు. కూలర్ లో నీళ్లు పోస్తున్న సమయంలో మనోజ్ కు విద్యుత్ షాక్ తగిలింది.
దీంతో మనోజ్ అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి అందివచ్చిన కుమారుడు విగత జీవిగా మారడంతో మనోజ్ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు. పెళ్లి ఈడుకు వచ్చిన తమవాడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడని మృతుడి బంధువులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. మృతుడు కుటుంబ సభ్యులు ఆక్రోదనలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. మనోజ్ మరణంతో శ్రీరామ్ నగర్ లో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి.
అందరితో ఎంతో చక్కగా కలిసిపోయేవాడని, ఇతరులకు సాయం చేయడంలో మనోజ్ ముందుంటాడని చెప్పుకుంటా స్థానికులు కన్నీటి పర్యతమయ్యారు. మరి.. ఇలా వేసవి కాలంలో కూలర్, ఏసీ, ఫ్యాన్ వంటి వాటి రూపంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే వస్తువులను వాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరి.. ఇలాంటి ఘోరమైన ఘటనలు జరగకుండా నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.