ప్రతి మహిళ 'అమ్మా' అని పిలిపించుకోవాలని ఎంతో ఆశ పడుతుంది. అలా అమ్మా అనే పిలుపు కోసం తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ప్రసవం సమయంలో కొందరు మహిళలు మృతి చెందుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం, ఆరోగ్య సమస్యల వంటి కారణాలతో బాలింతలు మరణిస్తున్నారు.
‘అమ్మా’ అని పిలిపించుకోవాలని ప్రతి మహిళ ఆశ పడుతుంది. అందుకే పురిటి నొప్పులను సైతం భరించి బిడ్డకు జన్మనిస్తుంది. అయితే ఈ ప్రసవం అనేది మహిళకు పునర్జన్మలాంటిది. ఎందుకంటే ప్రసవం సమయంలో ఆమె ఎంతో నరకం అనుభవిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలతో కాన్పు చేస్తుండగా గర్భిణీలు మృతి చెందుతుంటారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ బాలింత మృతి చెందింది. ప్రభుత్వ ఆస్పత్రిలో సిజేరియన్ చేయించుకున్న ఆమె తీవ్ర రక్తస్రావంతో మృతి చెందడం వివాదస్పదమవుతోంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం చిక్కుడుగుంట గ్రామానికి చెందిన బత్తుల ప్రేమ్ చంద్, రేష్మబీ(23) భార్యాభర్తలు. అయితే గర్భిణీ అయిన రేష్మబీకి ఇటీవల డెలివరీ సమయం దగ్గర పడింది. దీంతో ఈనెల 10న ప్రసవం కోసం రేష్మను భర్త ప్రేమ్ చంద్ మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రసవానికి ఇంకా సమయం ఉందంటూ ప్రాథమిక చికిత్స అందించారు. ఈ క్రమంలో 11న తెల్లవారు జామున ఆ మహిళకు పురిటి నొప్పులు అధికమవడంతో ఆసుపత్రి వైద్యులు సిజేరియన్ చేసి కాన్పు చేశారు. రెండు కేజీల బరువు ఉన్న మగ బిడ్డకు రేష్మ జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ సమయంలో , ఆ తరువాత తీవ్ర రక్తస్రావం జరిగింది.
దీంతో వెంటనే రేష్మను మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే భద్రచలం ఆస్పత్రికి తరలించారు. అయినప్పటీకి రక్తస్రావం అదుపులోకి రాకపోవడంతో ఆమె మృతి చెందింది. అయితే మణుగూరు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే తమ బిడ్డ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కాన్పు సమయంలో రక్తం అవసరం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా వైద్యాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుబం సభ్యులు కోరుతున్నారు.
అలానే భద్రాచలం ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కూడా ఉందని కొందరు ఆరోపించారు. అయితే రేష్మ మృతిపై భద్రాచలం వైద్యులు స్పందించారు. ఆమె అస్పత్రికి వచ్చేలోగానే మృతి చెందిందని, తమ నిర్లక్ష్యం లేదని భద్రాచలం డాక్టర్లు చెబుతున్నారు. అలానే రేష్మ మృతిపై మణుగూరు ఆసుపత్రి సూపరింటెండ్ కూడా స్పందించారు. రేష్మబీకి సీనియర్ గైనకాలజిస్టు వైద్యునితో చికిత్స అందించామని, అంతర్గత సమస్య కారణంగా బాధితురాలి మరణించిందని, వైద్యుల నిర్లక్ష్యం లేదని తెలిపారు. మరి.. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఓ నిండు ప్రాణం బలైంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.