మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. కొంతమంది అనారోగ్యంతో చనిపోతే.. మరికొందరు రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతుంటారు. కొన్నిసార్లు మానవ తప్పిదాల వల్ల మృత్యు కోరల్లో చిక్కుకుంటారు.
విధి ఆడే వింతనాటకంలో ఎవరు ఎప్పుడు విగత జీవిగా మారుతారో తెలియదు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపి.. అకస్మాత్తుగా మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. దీంతో వారి కుటుంబాల్లో ఒక్కసారిగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. కొంతమంది అనారోగ్యంతో చనిపోతే.. మరికొందరు రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతుంటారు. కొన్నిసార్లు మానవ తప్పిదాల వల్ల మృత్యు కోరల్లో చిక్కుకుంటారు. తాజాగా నీట మునిగి బాలిక, ఆమెను రక్షించ బోయి యువకుడు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని సంజయ్ కాలనీ నీలా యాదమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండేళ్ల క్రితం ఆమె భర్త మృతి చెందాడు. అప్పటి నుంచి కుటుంబ భారం అంతా ఆమె మోస్తూ వచ్చింది. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. చిన్న కుమార్తె నీలా జ్యోతి (13) ఎనిమిదో తరగతి చదువుతోంది. వారి ఇంటి సమీపంలో పీర్లబావి ఉండేది. సెలవులు కావడంతో పీర్ల బావి వద్ద ఈత నేర్చుకోవాలని జ్యోతి అనుకుంది.
ఈక్రమంలో రోజూ పీర్ల బావి వద్దకు వెళ్తుండేది. శనివారం రోజు కూడా ఈతకు వెళ్లింది. ఆ సమయంలో ఒంటికి మూడు ప్లాస్టిక్ సీసాలు కట్టుకొని మరింత ఎక్కువ ఈత సాధన చేసింది. ఆదివారం రెండు సీసాలను తొలగించి పీర్ల బావిలో ఈత కోట్టే ప్రయత్నంలో మునిగింది. జ్యోతి మునిగిపోవడాన్ని సమీపం ఉన్న సందగళ్ల నాగరాజు(25) గమనించాడు. వెంటనే బాలికను కాపాడేందుకు బావిలోకి దూకాడు. ఆ బావి లోతు ఉండడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ప్రజలు వచ్చి బావిలోకి దూకిన నాగరాజును బయటకు తీశారు. అనంతరం వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అయితే అప్పటికే వైద్యులు అతడు మృతిచెందినట్లు తెలిపారు. బావి లోతు ఎక్కువగా ఉండటంతో జ్యోతి మృతదేహం తీసేందుకు స్థానికులు కష్టపడాల్సి వచ్చింది. చివరకు ఆమె మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. ఇప్పటికే ఆ బావిలో ఐదుగురు పడి చనిపోయారని, ఆ బావిని వెంటనే మూసివేసి బోరుమోటరు వేయాలని స్థానికులు కోరారు. మరి.. ఈత నేర్చుకోవాలనే సరద కారణంగా ఇద్దరి ప్రాణాలు బలయ్యాయి. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ప్రమాదాల నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.