తెలంగాణలోని నారాణయణ ఖేడ్ కస్తూరిబా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిన్న బాలికలు అస్వస్థకు గురయ్యారు. కొందరు వాంతులు, విరోచనాలతో నీరసించి పోయారు. మరికొందరు కడుపు నొప్పిని తాళలేక విలవిలాడిపోతోన్నారు. 35 మంది విద్యార్ధినిలను నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తోన్నారు. విద్యార్ధినిల తల్లిదండ్రులతో ఆస్పత్రి కిటకిటిలాటింది. వాంతులు, కడుపు నొప్పితో బాలికల అల్లాడిపోతోన్నారు.
సంగారెడ్డి జిల్లాల నారాణయణ ఖేడ్ లోని కస్తూరిబా బాలికల వసతి గృహంలో శనివారం ఉదయం పిల్లలు టిఫిన్ చేశారు. అనంతరం పాఠశాలకు వెళ్లిన ఆ విద్యార్ధినిలు అస్వస్థకు గురయ్యారు. కొందరు కళ్లు తిరిగి పడిపోవడం, వాంతులు చేసుకోవడం జరిగింది. దీంతో వెంటనే ఆ పాఠశాల ఉపాధ్యాయులు స్పందించి.. పిల్లలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మొదట 10 మంది బాలికలు కళ్ల తిరుగతున్నట్లు,వాంతులు చేసుకుని అస్వస్థకు గురి కాగా, ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఆ సంఖ్యగా పెరుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు 35 మంది విద్యార్ధులు అస్వస్థకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కు సంబంధించి ఫూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టీఫిన్ చేసిన సమయంలో ఏమైనా పురుగులు, ఇతర పదార్దాలు కలిశాయా? అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఆస్పత్రిలో విద్యార్ధినిల రోదనలను మిన్నంటాయి. స్థానికులు, వైద్య అధికారులు ఆస్పత్రిలో చేరిన విద్యార్ధినిలను పరీక్షిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.