ప్రతి మనిషికి చదువు అనేది అతి ప్రధానమైనది. ఉన్నత స్థితికి ఎదిగేందుకు విద్యా అనేది ప్రధాన వారధిగా ఉంటుంది. అందుకే చాలా మంది పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు రేయింబవళ్లు కష్ట పడుతుంటారు. కొందరి నిర్లక్ష్యం.. విద్యార్థుల పాలిట శాపంగా మారుతుంది. అలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. తాజాగా ఓ యువతి విషయంలో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
ప్రతి ఒక్కరికి విద్యార్థి దశ అనేది ప్రధానమైనది. ఈ దశలో ఎంత కష్టపడి చదివి పరీక్షలు రాస్తే.. అంత మంచి ఫలితం ఉంటుంది. అందుకే చాలా మంది విద్యార్థులు రేయింబవళ్లు కష్టపడి చదివి మంచి మార్కులు సాధిస్తుంటారు. అయితే కారణం ఏమైనప్పటికి కొందరి విషయంలో సంవత్సరం మొత్తం చదివిన చదువు వృథా అవుతోంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని పగలు రాత్రి అని తేడా లేకుండా నిత్యం పుస్తకాలతో కష్టపడుతుంటారు. తీరా పరీక్షల రోజున అనారోగ్య బారిన పడటం, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా హాల్ టిక్కెట్ అందకపోవడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి కారణాలతో కొందరు విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారు. తాజాగా జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ విద్యార్థినికి కొందరి నిర్లక్ష్యం శాపమైంది. బాధితురాలి కథనం ప్రకారం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణానికి చెందిన వేదశ్రీ దోస్త్ అనే యువతి కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ప్రతి రోజూ కాలేజీకి వస్తూ తరగతులకు హాజరయ్యేది. ఇలా లెక్చర్స్ చెప్పే పాఠాలను ఎంతో శ్రద్ధగా వినేది. అలానే రాబోయే పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని కోరికతో ఉండేది. అందుకు తగినట్లే రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తి పట్టేది. ఈ క్రమంలోనే డిగ్రీ ప్రథమ ఏడాది సెమిస్టర్ పరీక్షలు మూడు రోజుల క్రితం మొదలయ్యాయి. అయితే వేదశ్రీకి హాల్ టికెట్ మాత్రం రాలేదు. ప్రిన్సిపల్ శ్రీనివాస్ ను సంప్రదించగా టెక్నికల్ ఇష్యూస్ కారణంగా హాల్ టికెట్ జారీ కాలేదని చెప్పాడు. అంతేకాక ఆ విద్యార్ధినికి సంబంధించిన పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి హాల్ టికెట్ లేకుండానే రెండు పరీక్షలు రాయించారు.
ఇక సోమవారం కూడా వేదశ్రీ యథావిధిగా పరీక్షకు హాజరైంది. అయితే ఆ యువతిని సదరు ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో బాధిత విద్యార్థిని, ఆమె బంధువులు ప్రభుత్వ కాలేజికి వెళ్లి.. అక్కడి సిబ్బందితో గొడవకు దిగారు. పరీక్ష ఫీజు కట్టినా హాల్ టికెట్ రాలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాలేజీ ప్రిన్సిపల్ వచ్చి తమ బిడ్డకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. ఇతర విద్యార్థులను కూడా పరీక్ష పేపర్లు తీసుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధిత యువతి బంధువులతో మాట్లాడారు. విద్యార్ధినికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు నచ్చజెప్పారు. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.