గతంలో ఎలుకలు రోగులను గాయపర్చిన ఘటనలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వార్తలో నిలిచింది. తాజాగా మరోసారి వార్తలోకి వచ్చింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పాము హల్ చల్ చేసింది. ఎంజీఎం ఆసుపత్రిలోకి రోగులతో పాటు పాములు కూడా వస్తున్నాయి. నిన్న సాయంత్రం ఫివర్ వార్డులోకి ఓ నాగుపాము దూరింది. ఆ పామును చూసి.. రోగులు, ఆసుపత్రి సిబ్బంది వణికిపోయారు. ఈక్రమంలో వార్డు బాయ్ ఒకరు పాముును పట్టుకుని బయట వదిలేశాడు. ఆస్పత్రి వార్డుల్లోకి విష పురుగులు రావడంపై రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.