నల్గొండ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో జిల్లాలోని పద్మారావునగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఆషాఢ మాసం అని ఇంటి నుంచి పుట్టింటికి వచ్చింది ఓ నవ వధువు. ఈక్రమంలో భారీ వర్షం తల్లీకూతురిని బలితీసుకుంది. పొట్టకూటి కోసం ఊరుకాని ఊరు నించి వచ్చి కూలీలుగా పనిచేస్తున్న వీళ్లు భారీ వర్షం బలితీసుకుంది. దీంతో ఆ కుటుంబలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన నడికూడి లక్ష్మి కుటుంబం పొట్టకూటి కోసం నల్గొండ జిల్లాకు వలస వచ్చింది. నల్గొండలోని పద్మారావు నగర్ లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. అక్కడే రైల్వే పనులు చేసే వారికి భోజనాలు పెట్టి, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. లక్ష్మి.. ఇటీవల తన కూతరు కళ్యాణి పెళ్లి చేసి అత్తగారింటికి పంపింది. ఆషాడమాసం కోసం కావడంతో కూతురు లక్ష్మి ఇంటికి వచ్చింది. కూతురి రాకతో ఆ ఇంట్లో ఆనందం వెళ్లి విరిసింది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. చాలా రోజుల తరువాత కలిసిన ఆ తల్లీకూతుర్లు.. తమ కష్ట సుఖాల గురించి మాట్లాడుకుంటూ రాత్రి ఒక మంచం మీద పడుకున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానాలకు పాత గోడలు కావడంతో కూలి అక్కడ ఉన్న బీరువాపై పడింది.
ఆ బీరువా కాస్తా నిద్రిస్తున్న తల్లీ కూతుళ్లపై పడింది. దీంతో వారిద్దరు నిద్రలోని మృత్యువాత పడ్డారు. దీంతో కుటుంబంలో కన్నీటి రోదనలు మిన్నంటాయి. తన భార్య బిడ్డలపై కూలిన గోడను తీసేందుకు ఎంత ప్రయత్నించిన వీలు కాలేదని, తన ముందు భార్యపిల్లలు చనిపోయారంటూ లక్ష్మి భర్త కన్నీటి పర్యతమయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.