మద్యం మత్తు ప్రాణాల మీదకి తెస్తుంది. మద్యం తాగి వాహనాలు నడిపిన ఘటనలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కొల్పోయారు. తాజాగా హైదరాబాద్ లోని మాదాపూర్ లో మరో మద్యం మత్తులో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాదాపూర్ లో మద్యం మత్తులో ఉండి కారు నడిపిన యువకుడు బైక్ ను ఢీ కొట్టాడు. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులకు తీవ్రగాలయ్యాయి. బైక్ ను ఢీ కొట్టిన తరువాత ఆ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ సెలార్ లోకి దూసుకెళ్లింది. మాదాపుర్ లోని సాయినగర్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న హరికృష్ణ.. మాదాపూర్ లోని అయ్యప్ప సోసైటీ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసుల గుర్తించారు.
సాయినగర్ నుంచి అయ్యప్ప సోసైటికి వెళ్తున్న సమయంలో తెల్లవారు జామున దాదాపు 3.25 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నటుగా సమాచారం. మద్యం మత్తులో వాహనం నడిపిన హరికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు వారు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు ఆగడం లేదు. వీకెండ్ వచ్చిందంటే చాలు రోడ్డుపై తిరగాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.