రెండు రోజుల క్రితం అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా శుక్రవారం అయ్యప్ప స్వామి మాలధారులు అతడిపై దాడి చేశారు. కోస్గిలో నరేష్ పై అయ్యప్ప భక్తులు దాడికి పాల్పడ్డారు. అతడు తప్పించుకుని వెళ్లే ప్రయత్నం చేయగా పరిగెత్తించి కొట్టారు. ఇదే సమయంలో సమీపంలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకుని నరేష్ పై దాడికి పాల్పడుతున్న అయ్యప్ప భక్తులను అడ్డుకున్నారు. భైరి నరేష్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అదే సమయంలో నరేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులు నిరసన చేపట్టారు.
రెండు రోజుల క్రితం కొడంగల్ లో జరిగిన ఓ సభలో భైరి నరేష్.. హిందు దేవుళ్లతో పాటు అయ్యప్ప స్వామిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడం తో వివాదంగా మారింది. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాక నరేష్ ని అరెస్టు చేయాలంటూ పలు ప్రాంతాల్లో ధర్నాలు చేపట్టారు. భైరి నరేష్ ను అరెస్టు చేయాలంటూ హిందువులు రెండు రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. అనేక ప్రాంతాల్లో నరేష్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాక పలు పోలీస్ స్టేషన్లలో భైరి నరేష్ పై ఫిర్యాదులు కూడా చేశారు. అతడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఆతడి యూట్యూబ్ ఛానల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో శుక్రవారం కోస్గి ప్రాంతంలో నరేష్ పై కొంత మంది అయ్యప్ప భక్తులు దాడి చేశారు.
Bairi Naresh who abused Swamy Ayyappa arrested .. thanks to Hindu unity 🔥 pic.twitter.com/EnSKNXNPxp
— Viक़as (@VlKASPR0NAM0) December 30, 2022