డేటింగ్ యాప్ పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. ఈ డేటింగ్ యాప్ వలలో చిక్కుకుని ఎంతో మంది లబోదిబోమంటున్న ఉందంతాలు అనేకం. తాజాగా ఓ వైద్యుడు కోటిన్నర రూపాయాలు పొగొట్టుకున్నాడు. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కిన సదరు వైద్యుడు ఆర్ధికంగా చితికిపోయాడు. అయితే ఇక్కడ్ వైద్యుడు అత్యుత్సాహం కూడ ఉంది. మొదట సారి మోసపోయినప్పుడు జాగ్రత్తపడకుండా… అలా మూడు పర్యాయాలు సైబర్ నేరాగాళ్ల చేతిలో మోసపోయాడు. చివరకి భవిష్యత్తును తలచుకుంటూ ఆ వైద్యుడి కుటుంబ సభ్యులు సోమవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే…
సికింద్రాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు(57) కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌లకు ఎంపికై, గుజరాత్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో 2020 జూన్ లో ఆన్ లైన్ కి వెళ్లి డేటింగ్‌కు సంబంధించిన ప్రకటనలో చూసి.. అందులోని నంబర్ కు ఫోన్ చేశాడు. అవతలి నుంచి మంచి ఇంగ్లిష్, హిందీ భాషలో మత్తు ఎక్కించి మాటలతో అమ్మాయిలు మాట్లాడారు. ఆ మాటలతో అతడిని ఉచ్చులోకి దింపారు. మీరు డేటింగ్ చేయాలంటే ముందుగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ మొదలు పెట్టారు. ఇలా ఆ యువతులతో వీడియో, టెక్ట్స్ చాటింగ్‌లు చేయిస్తూ నాలుగు నెలలు వైద్యుడి నుంచి రూ.41.50 లక్షలు లాగేశారు. 2020 అక్టోబర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సీసీఎస్ సైబర్‌క్రైమ్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ సదరు ఉద్యోగి బుద్ది మారలేదు.
మళ్లీ డేటింగ్ యాప్ మోజులో పడ్డాడు. ఈక్రమంలో దాదాపు రూ.30 లక్షలు పొగటుటుకున్నాడు. 2021 మార్చిలో పోలీసులను ఆశ్రయించాడు. రెండు సార్లు దెబ్బతిన్న బాధితుడి ఆలోచనలు మాత్రం మాలేదు. మూడోసారి తిరిగి డేటింగ్ యాప్‌లో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. ఈ సారి ఎకంగా రూ.80 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. కొంత కాలంగా డేటింగ్ యాప్‌లో చాటింగ్ చేస్తున్న ఈ వైద్యుడు రూ.1.5 కోట్లు పోగొట్టుకున్నాడు.
ఎలాగైనా అతడిలో మార్పు తేవాలంటూ కుటుంబ సభ్యులు తాజాగా సోమవారం బాధిడిని తీసుకొని, సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్న ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ బాధితుడి మైండ్ సెట్ ఇలా ఎందుకుందని ఆరా తీస్తున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.