నేటికాలంలో పేగుబంధాలు మాయమైపోతున్నాయి. ధనం ముందు ప్రేమానుబంధాలు కనుమ రైపోతున్నాయి. డబ్బు, ఆస్తిపాస్తుల ముందు మానవత విలువలు మంటగలిపితున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన చూస్తే అవుననక మానరు. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త, పేగు తెంచుకు పుట్టిన కొడుకు కలసి మతిస్థితిమితం తప్పిన మహిళ రైలెక్కించి పంపించేశారు. ఆ తర్వాత ఆమె చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం తీసుకుని ఆమె పేరున ఉన్న కోట్ల రూపాయల ఆస్తిని తమ పేర్లపై బదిలీ చేయించుకున్నారు. చెన్నైకి చేరిన ఆమెను ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసింది. అక్కడి వారు పంపిన ఫోటోలు పోలీసులు చూపేడితే తన తల్లే కాదన్నాడు ఆ పుత్రరత్నం. మానవ సంబంధాలను మంటగొల్పే ఈ ఘటన హనుమకొండలో వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచరం ప్రకారం..
హనుమకొండ ప్రాంతానికి చెందిన 46 ఏళ్ల మహిళకు భర్త, కుమారుడు ఉన్నారు. కొడుకు బెంగుళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ మహిళకు పెళ్లి సమయంలో వారి తల్లిదండ్రులు కట్నకానుకల కింద ఇచ్చిన ఆస్తుల విలువ ప్రస్తుతం మార్కెట్ ప్రకారం సుమారు రూ.15 కోట్లు ఉంటుంది. ఆమెపై ఇష్టం లేని భర్త.. వదిలించుకుని మరొక మహిళను వివాహం చేసుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆస్తి ని తమ పేరిట బదిలీ చేయాలని ఆమెను వేధించసాగాడు. తనకూ ఆస్తిలో వాట వస్తుందని కుమారుడు సైతం తండ్రికి వంతపాడాడు. అయినా ఆమె ఆస్తి వారిపై రాసేందుకు అంగీకరించలేదు.
దీంతో తండ్రి కొడుకుల వేధింపులు ఎక్కువయ్యాయి. కొన్నాళ్లకు ఆమె మతిస్థితిమితం కోల్పోయింది. ఆమె అలా ఉన్న తమకు ఆస్తి రాదని, ఆమె చనిపోతేనే సమస్యకు పరిష్కారమని ఆ తండ్రి, కొడుకు భావించారు. 2017లో ఓ రోజు వారిద్దరూ దగ్గరుండి ఆమెను రైలెక్కించి పంపించారు. ఆ తరువాత ఆమె చనిపోయినట్లు అందరిని నమ్మించి.. ఆస్తి తమ పేరిట రాయించుకున్నారు. భర్త మరొకరిని వివాహం చేసుకుని విదేశాలకు వెళ్లిపోయాడు. కొంతకాలానికి బంధువులు సైతం ఆమె విషయాన్ని మర్చిపోయారు.
రైలెక్కిన ఆమె కొద్ది రోజుల తర్వాత చెన్నైకి చేరుకోగా అక్కడి రైల్వే పోలీసుల సాయంతో స్వచ్ఛంద సంస్థ ఆమెను చేరదీసింది. ఆమె గతాన్ని పూర్తి గా మరిచిపోవడంతో ఆమెకు ఆధార్ కార్డు తీసేందుకు స్వచ్చంద సంస్థ నిర్వహకులు చెన్నైలోని కేంద్రానికి వెళ్లారు. ఆమె వేలిముద్రలు తీస్తుండగా అప్పటికే ఆమెకు కార్డు ఉన్నట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. దీంతో వెంటనే కార్డు తీసుకుని వివరాలు సేకరించి.. తెలంగాణాలోని హనుమకొండ మహిళగా గుర్తించారు.
హనుమకొండ పోలీసుల ద్వారా ఆమె కుమారుడు వద్దకు వెళ్తే.. తన తల్లి ఎప్పుడో చనిపోయిందని.. డెత్ సర్టిఫికెట్ కూడా ఉందని బుకాయించాడు. లోతుగా విచారిస్తే అసలు కుట్ర బయటపడింది. ప్రస్తుతం అయితే సదరు మహిళ స్వచ్చంద సంస్థ నిర్వాహకుల వద్ద ఉంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆ స్వచ్ఛంద సంస్థ వాళ్లు లేఖలు పంపిచారు. మరి..ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
ఇదీ చదవండి: ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఎంత!.. పది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళ!
ఇదీ చదవండి: నల్గొండలో దారుణం.. ప్రేమను కాదన్నదని, యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు!