వైద్య పరంగా ఎంతో అభివృద్ది చెందినప్పటికీ మన దేశంలో అక్కడక్కడ ప్రసూతి మరణాల సంభవిస్తున్నాయి. కాన్పు కోసం ఓ గర్బిణీని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. తమ ఇంటికి పండంటి బిడ్డ రాబోతుందని సంతోషించారు ఆమె అత్తింటి వారు. కానీ స్వల్ప వ్యవధిలోనే శిశువు, బాలింత ఇద్దరూ మరణించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
భద్రాచలంలోని అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న నాగటి రాధ(22)గర్భిణీ. నెలలు నిండి పురిటి నొప్పులతో శుక్రవారం ఉదయం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు పరీక్షించి.. మరొక ఆస్పత్రికి తీసుకెళ్లమని కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో వారు స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు సదరు మహిళను పరీక్షించి అనంతరం డెలివరీ చేసి.. మగ శిశువును బయటకు తీశారు. కానీ శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. అదే సమయంలో రాధకు తీవ్ర రక్తస్త్రావం అవుతుండటంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లమని వైద్యులు సలహా ఇచ్చారు. అయితే మరో ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో మళ్లీ ప్రభుత్వా ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాలింతను పరీక్షిచింన వైద్యులు అప్పటికే రాధ మృతి చెందినట్లు నిర్ధారించారు.
కొద్ది గంటల వ్యవధిలో తల్లిబిడ్డలిద్దరూ మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల నిర్లక్షమే తమ బిడ్డ మృతికి కారణమంటూ రాత్రి సమయంలో ఏరియా ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. అయితే సదరు మహిళలకు రక్తహీనత వల్ల కాన్పు కష్టమవుతుందనే ఉద్దేశంతో కొత్తగూడెం ఆసుపత్రికి రిఫర్ చేశామని.. ఇందులో తమ నిర్లక్ష్యం ఏమాత్రం లేదని ఏరియా ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు.మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.