ప్రతి ఒక్క దంపతుల జీవితంలో సంతానం అనేది ప్రధానమైనది. అలా ప్రతి జంట సంతానంతో తమ జీవితాన్ని ఆస్వాదిస్తుంది. అయితో కొందరు సంతానం కోసం కళ్లు కాయలు కాసేలా ఏళ్లతరబడి ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి సంతానం కలుగుతే.. ఇంక వారి ఆనందానికి అవధులు ఉండవు. ఆ బిడ్డను అపురూపంగా చూసుకుంటారు. కానీ కొన్ని సమయంలో విధి ఆ బిడ్డను వారి నుంచి దూరం చేసి గుండె కొత మిగులుస్తుంది. తాజాగా ఓ దంపతులకు వివాహమైన 16 ఏళ్లకు మగసంతానం పుడింది. సంతోషంతో ఆ బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో పాము రూపంలో మృతువు ఆ బిడ్డను కాటేసింది. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన బైరెడ్డి సంతోష్, అర్చన దంపతులు. వీరికి సంతానం లేక అనేక మంది దేవులకు పూజలు, వ్రతలు చేశారు. అలా వీరికి వివాహం జరిగిన 16 ఏళ్లకు ఓ బాబు జన్మించాడు. ఇక ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ బిడ్డకు నైతిక్ అని నామరకరణం చేసుకున్నారు. అలా అల్లారు ముద్దుగా నైతిక్ ని పెంచుకుంటున్నారు. ఈ గురువారం రెండేళ్ల వైతిక్ నిద్రలేచి పొరుగింటి మహిళ దగ్గర ఆడుకుంటున్నాడు. అదే సమయంలో ఇంట్లో నుంచి పాము బయటకి వచ్చింది. గమనించిన గ్రామస్థులు దాన్ని కర్రలతో కొట్టారు.
ఇదీ చదవండి: సింహానికి కంటి ఆపరేషన్.. దానికి కళ్లు కనిపించటం లేదని ఎలా గుర్తించారంటే?..
అయితే చనిపోయింది కదా! అని ఆ పామును పక్కకు నెట్టారు. చనిపోయిందనుకున్న ఆ పామును చూసేందుకు జనం గుమిగూడారు. వారితో పాటు ఈ మహిళ నైతిక్ తో పక్కనే నిలబడి చూస్తుంది. ఈక్రమంలో కొన ఊపిరితో ఉన్న ఆ సర్పం.. హఠాత్తుగా పైకి లేచి ఆ మహిళ చేతిలోని నైతిక్ ని కాటేసింది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆ బాలుడిని వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బాబును బతికించడానకి డాక్టర్లు ఎంతో తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఇదీ చదవండి: ఇలాంటి కష్టం పగవాడికి కూడా వద్దు.. కుమారుడి శవం కోసం బిచ్చమెత్తిన తల్లిదండ్రులు!
గురువారం రాత్రి చికిత్స పొందుతూ ఆ బాలుడు తుదిశ్వాస విడిచాడు. లేక లేక పుట్టిన బిడ్డ.. ఇలా పాము కాటుతో ప్రాణాలు పోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిపోయారు. వారి వేదన స్థానికులను కంటతడి పెట్టించింది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.