ప్రభుత్వం నడిపించే బీసీ, ఎస్సీ, గురుకుల వసతి గృహల్లో ఉంటూ ఎంతో మంది పేద విద్యార్ధులు చదువుకుంటుంటారు. అయితే కొన్ని వసతి గృహల నిర్వహకులు విద్యార్థుల పట్ల ఘోరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా వికారాబాద్ జిల్లాలోని ఓ బీసీ వసతి గృహంలో మధ్యాహ్నం 12 గంటలు అయినా కూడా టిఫిన్ పెట్టకపోవడంతో విద్యార్థులు ఆకలితో అల్లాడిపోయారు.
ప్రభుత్వం నడిపించే బీసీ, ఎస్సీ, గురుకుల వసతి గృహల్లో ఉంటూ ఎంతో మంది పేద విద్యార్ధులు చదువుకుంటుంటారు. అయితే కొన్ని వసతి గృహల నిర్వహకులు విద్యార్థుల పట్ల ఘోరంగా ప్రవర్తిస్తుంటారు. నాణ్యతలేని ఆహారం పెట్టడం, విద్యార్థులకు అందాల్సిన వస్తువులను పక్కదారి పట్టించడం వంటివి చేస్తుంటారు. తాజాగా వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
శుక్రవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థులు ఆకలి అంటూ ఆర్తనాదలు చేశారు. అటుగా వెళ్తున్న కొందరు విద్యార్థుల రోదన చూసి స్థానిక ఎంపీడీవో రమేశ్ కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే బీసీ బాలిక వసతి గృహానికి చేరుకుని విషయం తెలుసుకున్నాడు. తమకు అన్నం పెట్టండి ఆకలితో కడుపు కాలుతుంది అంటూ అన్నం కోసం ఆ విద్యార్థులు రోదించారు. మధ్యాహ్నం 12 గంటలు అయిన విద్యార్థులకు టిఫిన్ పెట్టకపోవడం విద్యార్థులు ఆకలితో రోదించారు. విద్యార్థుల పరిస్థితిపై ఏపీడీవో తీవ్ర ఆవేదన చెందారు. విద్యార్థులకు సంజాయించి భోజనం పెట్టించారు. అలానే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పి నీరసంగా ఉన్న విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అదే వసతి గృహంలో 9 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వారి పరీక్షలు ఉండడంతో విద్యార్థులకు సంజాయించి భోజనం పెట్టించి ఎగ్జామ్ సిద్ధం చేసినట్లు ఎంపీడీవో రమేష్ వివరించారు. వార్డెన్ శశిరేఖ, ఆమె భర్త రవిపై ఎంపీడీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ శశిరేఖ నిర్లక్ష్యానికి ఆగ్రహానికి గురైన స్థానిక నాయకులు పవన్ ఠాకూర్, సాయిలు గౌడ్,గోపాల్, నాయక్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో రమేష్ కు చెప్పడం జరిగింది. అకలితో అలమట్టిస్తున్న బీసీ వసతి గృహ బాలికలు ఎంపీడీవో రావడంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. అలానే ఆ విద్యార్థులు ఆయనను పట్టుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. మరి.. ఇలా విద్యార్థుల పాలిట రాక్షసుల్లా ప్రవర్తిస్తున్న వారికి ఎలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.