వేగంగా విస్తరించిన సాంకేతిక విజ్ఞానతో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ అభివృద్ధి రాకెట్ స్పీడ్ లో దూసుకు పోతుంటే, మరో వైపు జనాల్లో మూఢ నమ్మకాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. తరచూ ఏదో ఓ ప్రాంతంలో క్షుద్రపూజల కలకలం రేపుతూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.
నేటి సమాజంలో మనిషి కాలంతో పోటీ పడుతూ మరీ.. అభివృద్ధిలో దూసుకెళ్తున్నాడు. నింగిలో సైతం నివాసాలు ఏర్పాటు చేసుకునే స్థాయికి మన విజ్ఞానం చేరుకుంది. ఇలా సాంకేతికంగా ముందుకెళ్తున్న ఈ కాలంలో కూడా కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం ఇంకా ముఢనమ్మకాలతో బతికేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో క్షుద్రపూజలు, మంత్రాల భయంతో ప్రజలు వణికి పోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో క్షుద్రపూజల కలకలం చోటుచేసుకుంది. కుళ్లిన మాంసం, కోడి గుడ్ల, పసుపు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలను ఉన్న సంచి జాతీయ రహదారి పై కనిపించింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం జిల్లా పెనుబల్లిలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. విజయవాడ నుంచి భద్రాచలం వెళ్లే జాతీయ రహదారిపై ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వింత పూజలు చేసి .. వ్యర్థాలను సంచిలో తీసుకొచ్చి జాతీయ రహదారిపై పడేశారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కుళ్లిన మాంసం, నిమ్మకాయలు, కుంకుమ, పసుపు, కోడిగుడ్లతో ఆ సంచి నిండి ఉంది. ఎక్కడో క్షుద్ర పూజలు చేసి.. వాటిని తీసుకొచ్చి ఈ జాతీయ రహదారిపై పడేసినట్లు అనుమానిస్తున్నారు. దుర్వాసన అధికంగా వస్తుండటంతో ఇంకా ఆ సంచిలో ఏమి ఉన్నాయో, ఏమో అనే సందేహం వ్యక్తమవుతుంది.
జనసంచారం ఉండే ప్రాంతంలో క్షుద్రపూజలు చేసిన సంచి పడి ఉండటంతో స్థానికులతో పాటు అటుగా వెళ్లే ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రెండు రోజుల నుంచి ఆ సంచి అక్కడే ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. కొన్ని నెలల క్రితం కాకినాడ జిల్లాలోను ఓ కాలేజీ బస్సులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. విద్యార్థులు ప్రయాణించే బస్సులో ముగ్గు వేసి, పసుపు కుంకుమ చల్లి, మిరపకాయలు పెట్టి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి.
దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఖమ్మం జిల్లాలో గతంలోనూ క్షుద్రపూజలు చేసిన ఘటనలు జరిగాయి. తాజాగా మరోసారి ఈ క్షుద్రపూజలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. చిన్న పిల్లలతో ఉంటున్నాము.. ఇలాంటి క్షుద్ర పూజలతో నిత్యం భయం భయంగా బతకాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి క్షుద్రపూజలు, చేతబడులు చేసేవారికి తగిన అవగాహన కల్పించాలని, మరోమారు ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.