నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం మత్తులో వాహనాన్ని నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా కొందరి నిర్లక్ష్యం కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాల కారణంగా అనే మూగ జీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం మత్తులో వాహనాన్ని నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా కొందరి నిర్లక్ష్యం కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరు అంగవైకల్యం ఏర్పడి.. నరకయాతన అనుభవిస్తున్నారు. అందరూ పట్టించుకోని దారుణం ఏమిటంటే.. ఈ ప్రమాదాల కారణంగా అనే మూగ జీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. రెండు రోజుల క్రితమే ఏపీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆరు మంది మరణించారు. తాజాగా నల్లొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 ఆవులు మృతి చెందాయి. ఇక బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అద్దంకి-నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద ఓ ప్రైవేటు బస్సు ఆవులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 ఆవులు అక్కడికక్కడే చనిపోగా.. మరికొన్ని తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారు జామున ఆవులు రోడ్డు దాటుతున్న క్రమంలో చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న భారతి ట్రావెల్స్ బస్సులు వాటిని ఢీ కొట్టింది. అతివేగంగా వచ్చి.. బస్సు ఢీ కొట్టడంతో 14 ఆవులు మృతి చెందాయి. పశువుల కాపరులు స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ నియోకవర్గంలోని కంబాలపల్లి గ్రామం. మృతి చెందిన ఆవుల ఖరీదు సుమారు రూ.5 లక్షలు ఉంటుందని బాధితులు అంటున్నారు. తాము సోమవారం రాత్రి ఆవులను ఓ పొలం వద్దకు తీసుకెళ్లామని, మంగళవారం తెల్లవారు జామున తిరిగి ఇంటికి వస్తున్న ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు అంటున్నారు.
భారతీ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఆవులను ఢీ కొట్టిందని, కొన్ని ఆవులు బస్సు కింద ఉండంతో అది ఆగిందని లేకుంటే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం డ్రైవర్ చేశాడని బాధితులు ఆరోపించారు. ఆ వేగానికి తాము పక్కకు తప్పుకున్నామని, క్షణం ఆలస్యమైన తమ ప్రాణాలు పోయేవని బాధితుల్లో ఒకరు అన్నారు. తమకు న్యాయం చేయాలని అధికారులను, పోలీసులను బాధితులు వేడుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఇలా కొందరు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా మనుషులతో పాటు మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.