నేటి కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చటి సంసారాలను రోడ్డున పడేయడమే కాకుండా నిండు జీవితాలను ఆగం చేస్తున్నాయి. ఇలాంటి కుంపటిలో పడి కొందరు సొంత సంసారాలను కాదని పరాయి వారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఇలా వివాహేతర సంబంధాల మధ్యలో డబ్బు కూడా వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో కొందరు తమకు అడ్డుగా ఉన్నవారిని హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ.. ఇద్దరు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుని.. చివరికి వారి చేతుల్లోనే బలైంది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చీకురుచెట్టుతండాకు చెందిన ముడావత్ దుబ్లీ (26) కి వనపర్తి మండలంలోని పడమటితండా వాసి వెంకటేష్‌తో సుమారు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కొన్ని నెలల క్రితం భర్తతో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.అప్పటి నుంచి వనపర్తిలో ఉంటూ రోజువారీ కూలీగా పని చేస్తుంది. అయితే ఎప్పటిలాగే ఏప్రిల్ 7న కూలి పనికి వెళ్లిన దుబ్లీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. అనుమానం వచ్చిన ఆమె తల్లి ముడావత్ ముత్యాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.
ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం గోపాల్ పేట మండలం తాడిపత్రిలోని చెరువులో ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ మృతదేహం కనిపించకుండ పోయిన దుబ్లీ గా గుర్తించారు.కేసు నమోదు చేసిన ఎస్ఐ హరిప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. కాగా విచారణలో భాగంగా ఓ ఆస్తకర విషయం బయటపడింది. తాడిపత్రికి చెందిన రమేష్, గోపాల్ అనే ఇద్దరు వ్యక్తులతో కొంతకాలంగా ఆ మహిళ వివాహేత సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో వారి ముగ్గురి మధ్య డబ్బు విషయంలో ఘర్షణలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే వీరి నుంచి దుబ్లీ ఎక్కువ డబ్బులు అడిగిందనే నెపంతో ఈనెల 7 కారులో తిరుమలాపూర్ శివారులోకి తీసుకెళ్లి గొంతునులిమి చంపేశారు. అనంతరం తాడిపత్రి చెరువులో పడేసినట్టు విచారణలో నిందితులు అంగీకరించారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చక్కటి సంసారాన్ని వదిలేసి అక్రమ సంబంధం పెట్టుకుని జీవితాన్ని అర్థాంతరంగా ముగించిన ఈ మహిళ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.