హైదరాబాద్ లోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఇది మరువక ముందే మహబూబాబాద్ జిల్లాలో అదే తరహా ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్ లోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనానం సృష్టించింది. ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ దాడి కొన్ని రోజు తరువాత కూడా పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. అంతేకాక కొందరిపై దాడి చేసి గాయపరిచాయి. తాజాగా ఓ వృద్దురాలిపై కుక్క దాడి చేసింది. శీలం రాంబాయమ్మ అనే వృద్ధురాలు ఇంటి ముందు కూర్చొని ఉండగా ఆమెపై ఓ కుక్క దాడి చేసి ముక్కును కొరికింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన శీలం రాంబాయమ్మ అనే వృద్ధాలు కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తుంది. బుధవారం రాంబాయమ్మ ఇంటి ముందు కూర్చొని ఉండగా అకస్మాత్తుగా ఓ కుక్క వచ్చి.. ఆమెపై దాడి చేసింది. కుక్కు దాడి చేస్తున్న సమయంలో ఆమె తీవ్రంగానే ప్రతిఘటించింది. అయితే వృద్దురాలిపై దాడి చేసిన కుక్క ఆమె ముక్కును కొరికేసింది. ఈ ఘటనలో వృద్ధురాలికి తీవ్ర గాయమైంది. అయితే వృద్ధురాలిని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఇదే గ్రామంలో మరో నలుగురు వ్యక్తులతో పాటు పలు పశువులపై వీధి కుక్కలు దాడి చేసి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. వీధి కుక్కల దాడిలో శీలం సమ్మన్న, జ్యోతి తదితరులున్నారు. వీధి కుక్కల వరుస దాడులతో ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇటీవల అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్ అనే బాలుడు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన తరువాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కుక్కలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. వెంకటాపురంలో జరిగిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.