తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. అంటే.. ఈ సృష్టిలో అందరికన్నా గొప్ప స్థానం అమ్మదే. నవమాసాలు మోసి, కని, బిడ్డని కళ్ళల్లో పెట్టుకుని చాకే తల్లిని మించిన వారు ఎవరుంటారు? కానీ.., తాజాగా ఓ నీచుడు రూ.200 కోసం కన్నతల్లిని నరికి చంపిన దారుణ ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
మద్యం కొనేందుకు రూ.200 ఇచ్చేందుకు నిరాకరించినందుకు మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన తల్లిని నరికి చంపాడు. మంచిర్యాల సబ్‌ఇన్‌స్పెక్టర్ గంగారాం తెలిపిన వివరాల ప్రకారం.. 65 ఏళ్ళ సత్తెమ్మ ఒంటరి స్త్రీ. భర్త చనిపోవడంతో ఈ వయసులో కూడా దినసరి కూలీగా జీవిస్తూ వస్తోంది. అయితే.., ఆమె కొడుకు కడమండ చంద్రశేఖర్ మాత్రం జులాయిగా మారాడు. మద్యానికి బానిసై ఎప్పుడు తల్లిని డబ్బులు వేధిస్తూ ఉండేవాడు.
చంద్రశేఖర్ ఎప్పటిలాగే శనివారం కూడా తల్లిని డబ్బులు అడిగాడు . కానీ.., సత్తెమ్మ తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో కొడుకు ఆవేశంతో ఊగిపోయాడు. తనకి రూ. 200 ఇవ్వలేదని తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. మృతురాలి కుమార్తె లక్ష్మి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. కన్నతల్లిని ఇంత దారుణంగా నరికి చంపిన ఈ నీచుడికి ఏ శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.