సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జీలో జరిగిన అగ్నిప్రమాదం గురించి మరువక ముందే సిటీలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ ఆఫీసులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆఫీస్ నుంచి పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసి పడ్డాయి. జూబ్లీ 800 అనే పబ్ పక్కనున్న ఓ ఆఫీస్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే స్థానికులు అందించిన సమాచారంతో రెండు ఫైరింజన్లతో అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో ఎవరు లేరని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
సికింద్రాబాద్ లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించిన సంగతి. పాస్ పోర్టు కార్యాలయం సమీపంలోని రూబీ లాడ్జీలో మంటలు వ్యాపించి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 10 మందికి గాయాలయ్యాయి. లాడ్జిలో బస చేస్తున్న వీరు అగ్నిప్రమాదం కారణంగా ఊపిరాడక మరణించారు. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎలక్ట్రిక్ షోరూమ్ లో సంభవించిన అగ్నిప్రమాదం కారణంగానే వీరు మరణించారు. ఈ ఘటన మరువక ముందే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ ఆఫీస్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాద సమయంలో ఎవరు లేనట్లు సమాచారం. ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.