హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. పట్టపగలు షాపులో ఉన్న ఓ మహిళ మెడలోంచి రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
గత కొంత కాలంగా హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని కొందరు చైన్ స్నాచర్లు రెచ్చిపోయి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చైన్ స్నాచింగ్ దొంగతనాలు గతంలో చాలానే జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హయత్ నగర్ లోని చైన్ స్నాచర్లు పట్టపగలు రెచ్చిపోయారు. ఒంటరిగా ఉన్న మహిళ షాప్ లోకి పక్కా ప్లాన్ తో వచ్చిన ఈ దుండగులు.. ఆమె మెడలోంచి రెండున్నర తులాల బంగారు గొలుసును దోచుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
అది సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతం. హయత్ నగర్ లోని ఓ మహిళ షాపులో ఒంటరిగా ఉంది. దీనిని గమనించిన కొందరు చైన్ స్నాచర్లు.. కొద్దిసేపు అక్కడ అంతా గమనించారు. ఇక పక్కా ప్లాన్ తో వచ్చిన ఈ దొంగలు.. ముఖాలకు హెల్మెంట్లు ధరించి సడెన్ గా.. ఓ వ్యక్తి బైక్ దిగి ఒంటరిగా ఉన్న ఆ మహిళ షాపులోకి వెళ్లాడు. వెళ్తు వెళ్తూనే ఆ దొంగ ఆమెపై దాడి చేసి ఆ మహిళ మెడలోంచి రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఆమె దొంగ దొంగ అని అరిచేలోపే ఆ చైన్ స్నాచర్లు బైక్ పై అక్కడి నుంచి పరారయ్యారు.
ఇక ఆ సమయంలో ఆ మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు. స్థానికులు అంతా గమనించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ, వాళ్లు సందుల్లో పడి ఎవరికీ కనిపించకుండా పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు అంతా భయంతో ఉలిక్కిపడి.. పోలీసు భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.