సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తుంటారు. పెరుగుతున్న ఆర్థిక అవసరాలు, ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులకు భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తుంటే సరిపోవడం లేదు. ఇక ఇళ్లు కొనాలన్నా, స్థలం తీసుకుని కట్టుకోవాలన్నా ఖర్చుతో కూడుకున్న పని. దీంతో వారి కలలు.. కల్లలుగా మారిపోతున్నాయి. అటువంటి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలుస్తుంటాయి. వారి కోసం పక్కా గృహలను నిర్మించి ఇస్తుంటాయి.. అయితే
సొంతిల్లు ఉండాలన్నదీ ప్రతి ఒక్కరి కల. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాటిని చాలా మంది నెరవేర్చుకోలేకపోతున్నారు. చాలీ చాలని జీతంతో కుటుంబ జీవితం నెట్టుకురావడమే కష్టంగా మారింది. పెరుగుతున్న ఆర్థిక అవసరాలు, ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులకు భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తుంటే సరిపోవడం లేదు. ఇక ఇళ్లు కొనాలన్నా, స్థలం తీసుకుని కట్టుకోవాలన్నా ఖర్చుతో కూడుకున్న పని. దీంతో వారి కలలు.. కల్లలుగా మారిపోతున్నాయి. అయితే నిరుపేదలకు కొన్ని సార్లు అండగా నిలుస్తుంటాయి ప్రభుత్వాలు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇళ్లు నిర్మిస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి నిర్మాణాలు చేపడుతుంటాయి. అయితే అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. హామీలు ఇచ్చినంత త్వరగా వాటిని ప్రజలకు అందించడంలో జాప్యం చేస్తుంటాయి. దీంతో ప్రజలు కూడా విసిగి వేశారి పోతుంటారు.
తెలంగాణలోని జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. గుడూరులో ఇప్పటికే 70 ఇళ్లు పూర్తి చేసింది. అయితే లబ్ధిదారులకు ఈ ఇళ్లను ఇవ్వకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు అధికారులు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. వారి ఇళ్ల ఎంపిక ఆలస్యం కావడంతో.. ఓపిక నశించిన గ్రామస్థులు ముందుగా ఆందోళన చేపట్టారు. అయినప్పటికీ అధికారుల నుండి స్పందన రాకపోవడంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలను పగుల గొట్టి, గృహ ప్రవేశాలు చేసేశారు. పేదలకు సకాలంలో అందించి ఉంటే తాము ఇలా తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించాల్సిన అవసరం ఉండేది కాదంటున్నారు స్థానికులు.
ఈ ఇళ్ల పనులు 2016లో మొదలయ్యాయి. రెండు మూడేళ్లలోనే ఇళ్లను పూర్తి చేసారు. అయినా కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. అధికారులే పంపిణీ చేస్తారని ఎదురు చూసిన లబ్దిదారులు.. ఎటువంటి స్పందన లేకపోవడంతో సోమవారం ఇళ్ల తాళాలు పగులకొట్టి లోపలికి వెళ్లారు. నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏ అధికారులు కూడా పట్టించుకోలేదని వారు వాపోయారు. తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మండిపడ్డారు. ఎవరైనా వచ్చి ఇళ్లు పంపిణీ చేస్తారన్న ఆశలేదని, ఎవరూ పట్టించుకోవపోవడంతోనే ఇప్పటి వరకు ఎదురూ చూసి నిరుత్సాహపడ్డామని వారు తెలిపారు.