పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు. పండుగలు వస్తే బాగుణ్ణు, లేదా బంద్ లు, స్ట్రైక్ లు జరిగితే బాగుణ్ణు అని కోరుకుంటూ ఉంటారు. ఎక్కువ సెలవులు వస్తే అమ్మమ్మ గారి ఊరికో, నాన్నమ్మ గారి ఊరికో వెళ్లాలని అనుకుంటారు. ముఖ్యంగా దసరా లాంటి పండగ వస్తే వారం, పది రోజుల పాటు బంధువులతో సరదాగా గడిపేయచ్చు అని అనుకుంటారు. అయితే ఈ దసరా పండుగకు మాత్రం ఎక్కువ రోజులు సెలవులు వస్తే బాగుణ్ణు అని కోరుకునే స్కూల్ పోరగాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది దసరా పండుగకు 13 రోజుల పాటు సెలవులను అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సర్క్యులర్ పంపించింది.
సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 8 వరకూ సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 5న దసరా సందర్భంగా 10 రోజులు ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. 13 రోజులు ప్రభుత్వం ఇచ్చిన సెలవులు కాకుండా అదనంగా.. మరో రెండు రోజులు సెలవులు కలిసి వచ్చాయి. సెప్టెంబర్ 25న, అక్టోబర్ 9న ఆదివారం కావడంతో అదనంగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో విద్యార్థులు పండగ చేసుకుంటున్నారు. మరి దసరా సందర్భంగా 15 రోజులు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి స్టూడెంట్స్. అలానే ఇన్ని రోజులు సెలవులు వచ్చినందుకు ఈ సెలవులకి ఎలా గడుపుతారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.
Dasara holidays: Schools in Telangana to remain closed from Sep 26 to Oct 9 https://t.co/JVb2StSf8p #Dussehra
— Oneindia News (@Oneindia) September 13, 2022