ప్రీతి కేసు రోజుకొక ములుపుకు తీసుకుంటోంది. అయితే టాక్సికాలజీ రిపోర్ట్ లో నమ్మలేని నిజాలు ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ టాక్సికాలజీ రిపోర్ట్ ను పరిశీలించిన అనంతరం పోలీసులు తాజాగా కీలక ప్రకటన చేశారు.
సంచలనంగా మారిన మెడికో ప్రీతి కేసు రోజుకొక ములుపుకు తీసుకుంటోంది. అయితే టాక్సికాలజీ రిపోర్ట్ లో నమ్మలేని నిజాలు ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ టాక్సికాలజీ రిపోర్ట్ ను పరిశీలించిన అనంతరం పోలీసులు తాజాగా కీలక ప్రకటన చేశారు. అసలు పోలీసులు చేసిన తాజా ప్రకటనలో ఏముందంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మెడికో ప్రీతి కేసు విషయంలో తాజాగా కీలక ప్రకటన చేశారు వరంగల్ సీపీ రంగనాథన్. టాక్సికాలజీ రిపోర్ట్ ను పరిశీలించిన పోలీసులకు కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఈ రిపోర్టులో ప్రీతి బాడిలో ఎలాంటి విషపదార్థాలు లేకపోవడంతో ఈ కేసు సంచలనంగా మారింది. అయితే ఈ కేసుపై వరంగల్ సీపీ రంగనాథన్ తాజాగా మాట్లాడుతూ.. టాక్సికాలజీ రిపోర్ట్ ను ఆధారంగా తీసుకుని ఈ కేసును ఫైనల్ చేయలేమని, ఇంకా ఫోరెన్సిక్, పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉందని తెలిపారు. అంతేకాకుండా ఈ కేసులో రాజకీయ కోణం కూడా దాగి ఉందని, ఇక మరోసారి అన్ని కోణాల్లో విచారించి.. రెండు రోజుల్లో ప్రీతి మరణంపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని వరంగల్ సీపీ రంగనాథ్ పేర్కొన్నారు.