దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కలెక్టర్ కార్యాలయం పైకి ఎక్కి తమ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. తమ సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఎన్నిసార్లు తిరిగినా తమ సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదనతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.
సమస్యలు ఉన్నాయని భార్యాభర్తలు కలెక్టర్ భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కలెక్టర్ భవనం పైకి ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపించకపోతే నిప్పు అంటించుకుని చనిపోతామని బెదిరించారు. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. పరిష్కారం చూపించే కలెక్టరేట్ వద్ద తమకు పరిష్కారం దొరకడం లేదని ఆవేదన చెందిన దంపతులు ఆత్మహత్యే శరణ్యం అని భావించారు. అందుకోసం పెట్రోల్ వెంటబెట్టుకుని కలెక్టర్ భవనం పైకి ఎక్కారు. అనంతరం ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకోవడంతో ప్రమాదం తప్పింది.
అయితే పోలీసులు సకాలంలో స్పందించి దంపతులిద్దరినీ బలవంతంగా అక్కడ నుంచి కిందకు దింపారు. ఆ తర్వాత వారి ఒంటిపై నీరు పోశారు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింహ, నిమ్మల రేవతి దంపతులకు వారసత్వంగా వచ్చిన 4 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో వేరే వారికి పట్టా చేశారు. రెండేళ్లుగా తమ సమస్యకు పరిష్కారం చూపమని తిరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యే శరణ్యం అని అనుకున్నారు. తీవ్ర ఆవేదన చెందిన దంపతులు కలెక్టరేట్ కార్యాలయంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భూ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. గతంలో కూడా ఈ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమస్య పరిష్కారం కోసం ఇలా కలెక్టర్ భవనం పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దంపతులపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.