హైదరాబాద్ నగరంలో ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీ. ఆ తర్వాత షాపింగ్. అయితే ఇటీవల అన్ని షాపింగ్స్‌కి అనువుగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చేస్తున్నాయి. ఇన్ ఆర్బిటల్ మాల్, ఫోరం మాల్, గలేరియా, జీవికే, ఏఎంబీ, మంజీరా మాల్స్ వంటివి అందుకు ఉదాహరణ.
హైదరాబాద్ నగరంలో ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీ. ఆ తర్వాత షాపింగ్. అయితే ఇటీవల అన్ని షాపింగ్స్‌కి అనువుగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చేస్తున్నాయి. ఇన్ ఆర్బిటల్ మాల్, ఫోరం మాల్, గలేరియా, జీవికే, ఏఎంబీ, మంజీరా మాల్స్ వంటివి అందుకు ఉదాహరణ. షాపింగ్స్, రెస్టారెంట్స్, సినిమాల హాల్స్ ఒక్క చోటే ఉండటంతో జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అలాగే వ్యాపారాలకు కూడలిగా మారిపోయాయి ఈ షాపింగ్ కాంప్లెక్సులు. ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నా కొత్తది వచ్చిందంటే చాలు వీకెండ్స్ అక్కడ వాలిపోతుంటారు జంట పక్షులు. విండో షాపింగ్ అయినా చేసి వచ్చే వాళ్లెంతమందో. బ్రాండెడ్ దుస్తులు, వస్తువుల కొనే వారు ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో దొరికే కంపెనీ షోరూంలలో కొనుగోలు చేస్తుంటారు.
అలాంటి షాపింగ్ ప్రియులకు ఓ శుభవార్త. ఇప్పుడు హైదరాబాద్‌లో మరో షాపింగ్ మాల్ ప్రారంభం కానుంది. గ్లోబల్ హైపర్ మార్కెట్ చైన్ అయిన లులూ గ్రూప్ కూకట్ పల్లిలో అతి పెద్ద మెగా షాపింగ్ మాల్ ప్రారంభిస్తోంది. కాగా, తెలంగాణలో ఇది తొలి లూలూ మాల్ కావడం విశేషం. మన దేశంలో ఇప్పటికే కొచ్చి, తిరువనంతపురం, బెంగళూరు, లక్నో, కోయంబత్తూరు నగరాల్లో లులూ మాల్స్ ఉన్నాయి. త్వరలోనే నోయిడాలోనూ లులూ మాల్ రానుంది. అయితే దేశంలో అతి పెద్ద మాల్ గా తెలంగాణలోనిది అవతరించబోతుంది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఆగస్టు నుండి ఓపెన్‌లో ఉంబోతోంది. ఇది 5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండనుంది. కేపీహెచ్‌బీలో ఉన్న మంజీరా మాల్‌ను లులూ గ్రూప్ రీబ్రాండింగ్ చేస్తోంది. ఇందుకోసం రూ.300 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఇది వరకే ప్రకటించింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా 2 వేల మందికి ఉపాధి లభించనుంది.
రూ. 2500 కోట్లతో హైదరాబాద్ లో మరో డెస్టినేషన్ మాల్ ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ఎండీ యూసుఫ్ అలీ తెలిపారు. వాస్తవానికి హైదరాబాద్ కంటే ముందే విశాఖపట్నంలో లులూ మాల్ ఏర్పాటు కావాల్సింది. ఈ మేరకు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు హయంలో ఒప్పందం కుదిరింది. కానీ 2019 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడం లులూ గ్రూప్ మనసు మార్చుకుని హైదరాబాద్ నగరానికి మళ్లింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో 200కి పైగా షాపులు ఉండపోతున్నాయి. 75కి పైగా లోకల్, నాన్ లోకల్ బ్రాండ్ సంస్థలు తమ షాపులను ఏర్పాటు చేయబోతున్నాయి. అలాగే 1400 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో 5 సినిమా స్క్రీన్లు అందుబాటులో ఉండనున్నాయి. దేశీయ, విదేశీ బ్రాండ్లతో కూడిన రిటైలర్లు, ప్రేయర్ హాల్, మెడికల్ సెంటర్ కూడా ఇందులో ఉంటాయి. ఒకేసారి 3 వేల కార్లను పార్కింగ్ చేసే వీలుంది.