తెలంగాణ లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించునున్న ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఆగస్టు 18 నుంచి పోలీసు నియామక మండలి అధికారి వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆగస్టు 28న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.
తాజాగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 18న ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 26న వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియలో ఏదైనా సమస్య తలెత్తితో support@tslprb.in కు ఈమెయిల్ లేదా 9393711110, 9391005006కు ఫోన్ చేయవచ్చు.
హాల్ టికెట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి: