వైద్యం కోసం.. హాస్పిటల్‌కు వెళ్తున్నారా..? అయితే మీరు అప్రమత్తంగా ఉండాల్సిందే. సమస్య ఒకటైతే మరోదానికి వైద్యం చేస్తున్నారు.. కొందరు డాక్టర్లు. అలాంటి ఘటన ఒకటి తాజాగా హైదరాబాద్‌లోనే వెలుగుచూసింది.
మనిషికి ప్రాణం పోసేది దేవుడైతే.. ఆ మనిషికి పునర్జన్మనిచ్చేది వైద్యుడు అంటారు. అలాంటి డాక్టర్ వృత్తికి దేశంలో ఎంత గణనీయమైన చరిత్ర ఉందో అందరికీ విదితమే. కొన్ని సందర్భాల్లో మనిషిపై ఆశలు వదులుకున్నా.. డాక్టర్లు అలాంటి వారిని కూడా బ్రతికిస్తుంటారు. అందుకోసం వారు పడే శ్రమ అంతా ఇంతా కాదు. కొన్ని గంటల పాటు శ్రమిస్తుంటారు. కానీ మరికొందరు వైద్యులు మాత్రం.. ఆ వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తిస్తుంటారు. ఇదిగో.. ఈ డాక్టర్ అలాంటివారా..? కాదా..? అన్నది మీరే చెప్పాలి. ఎడమ కాలికి సమస్య ఉందని ఆస్పత్రికి వెళ్తే.. కుడి కాలికి సర్జరీ చేశాడు. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.. హైదరాబాద్ లోనే.
ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన కరణ్ ఎం.పాటిల్ అనే అర్థోపెడియన్ డాక్టర్.. రోగి ఎడమ కాలికి సర్జరీ చేయాల్సి ఉండగా, కుడి కాలికి చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన బాధితుడు తరుపు వారు అతన్ని ప్రశ్నించగా.. రెండు రోజుల అనంతరం మరోసారి ఎడమ కాలికి సర్జరీ చేశాడు. రెండు కాళ్లకు చేయడంతో బాధిత వ్యక్తి బెడ్ కే పరిమితమయ్యాడు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో వైద్యుడు తప్పుచేసినట్లు తేలడంతో రాష్ట్ర వైద్య మండలి అతనిపై వేటు వేసింది. కరణ్ ఎం.పాటిల్ గుర్తింపును 6 నెలల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కావున వైద్యం కోసం.. హాస్పిటల్‌కు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి సుమా.. ఈ ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hyderabad doctor operates on the wrong leg of a patient, medical council suspends licence for six monthshttps://t.co/47pmybcTNM
— OpIndia.com (@OpIndia_com) April 14, 2023