టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి ఎన్నో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీఎస్ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఆయన ఎన్నో వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఇటీవల ఆర్టీసీ స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రవేశపెట్టిన ఓ పథకాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని నిర్ణయించింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వారు తిరిగి ఇంటికి వెళ్లడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇటీవల వజ్రోత్సవాల సందర్భంగా ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని హైదరాబాద్ లో ఇక ముందు కూడా కొనసాగించాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఏదైనా ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చూపించుకోవడానికి వెళ్లిన వారు అక్కడ వైద్యులకు చూపించుకున్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు 2 గంటల వరకూ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్ఛు.
ఈ సౌకర్యం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడివరకైనా ఉచితంగా చేరుకోవచ్ఛు. హైదరాబాద్ లో చికిత్స కోసం పలు జిల్లాల నుంచి వస్తుంటారు. ఆసుపత్రిలో వైద్యులు రాసిన మందుల చిట్టీపైనే సమయాన్ని సూచిస్తారు. ఆ చిట్టీని కండక్టర్‌కు చూపిస్తే ఉచితంగా ప్రయాణించడానికి వీలుంటుంది. ఇలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఎంజీబీఎస్, జేబీఎస్ లేదా ఇతర చోట్ల ఎక్కడ బస్సు దిగినా సిటీ బస్సుల్లో 2 గంటల పాటు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఉంటుందని రంగారెడ్డి ఆర్టీసీ రీజినల్ మేనేజర్ తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.